TVS iQube MillionR : ఒక్క ఛార్జ్‌తో 145 కి.మీ రేంజ్‌.. TVS కొత్త ఈ-స్కూటర్ అదిరిపోయిందిగా! ధర ఎంతంటే?

TVS iQube MillionR : ఐక్యూబ్ పది లక్షల కస్టమర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా టీవీఎస్ కొత్త మిలియన్ఆర్ స్పెషల్ ఎడిషన్‌ తీసుకొచ్చింది. ఇందులో కొత్త కలర్ స్కీమ్, స్పెషల్ మిలియన్ఆర్ బ్యాడ్జింగ్, ప్రీమియం సీట్లు ఉన్నాయి.

TVS iQube MillionR Special Edition

  • టీవీఎస్ ఐక్యూబ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది
  • ఈ స్పెషల్ ఎడిషన్ మార్కెట్ ధర రూ. 1.40 లక్షలు
  • సింగిల్ ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల రేంజ్

TVS iQube MillionR : టీవీఎస్ అభిమానులకు గుడ్ న్యూస్.. టీవీఎస్ బ్రాండ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. టీవీఎస్ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ (iQube) కొత్త మిలియన్ఆర్ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.

10 లక్షల కస్టమర్ల మైలురాయిని దాటిన సందర్భంగా కంపెనీ ఈ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్‌లో డిఫరెంట్ కలర్, డిజైన్‌తో పాటు కొన్ని సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా కొనుగోళ్లతో టీవీఎస్ ఐక్యూబ్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా అవతరించింది.

టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్‌లో అతిపెద్ద మార్పు తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌కు కొత్త అరోరా గ్రీన్ డ్యూయల్-టోన్ కలర్ అందించారు. కొత్త కలర్ మాత్రమే కాదు.. ఈ స్కూటర్‌కు స్పెషల్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ మిలియన్ఆర్ బ్యాడ్జింగ్ కూడా ఉంది. సాధారణ ఐక్యూబ్ మోడల్ కన్నా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఈ స్కూటర్‌లో ప్రీమియం సీట్ కవర్లు కూడా ఉన్నాయి.

Read Also : SBI FD Scheme : సీనియర్ సిటిజన్లకు పండగే.. SBI FDపై అదిరే వడ్డీ.. 6 నెలలకు డబుల్ బెనిఫిట్!

USB టైప్-C పోర్ట్ ఫీచర్ :
రోజువారీ వినియోగానికి టీవీఎస్ ఈ కొత్త స్పెషల్ ఎడిషన్‌లో కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. గతంలో ఐక్యూబ్‌లో సీటు కింద USB-A పోర్ట్ ఉండేది. దాంతో ఫోన్‌ను ఛార్జ్ చేయాలంటే సీటును ఓపెన్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు, కొత్త USB టైప్-C పోర్ట్ కారణంగా ఈజీగా ఫోన్ ఛార్జింగ్ పెట్టొచ్చు.

సింగిల్ స్టోరేజీ బాక్సు :
ఈ కొత్త ఎడిషన్‌లో మొబైల్ ఫోన్లు, ఇతర చిన్న రోజువారీ వస్తువులను దాచుకోవడానికి వీలుగా ఫ్రంట్ సైడ్ సింగిల్ స్టోరేజ్ బాక్స్ కూడా ఉంది. అవసరమైతే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్‌ను ఈ స్టోరేజ్ స్పేస్‌లో ఉంచుకోవచ్చు. నగరంలో రోజూ తమ స్కూటర్లపై ప్రయాణించే వారికి ఈ ఫీచర్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

145కి.మీ వరకు రేంజ్ :
ఈ కొత్త మోడల్ ఈవీ స్కూటర్ 145 కిలోమీటర్ల వరకు IDC రేంజ్‌ అందిస్తుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 145 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అయితే, ట్రాఫిక్, స్కూటర్ స్పీడ్, రైడర్ బరువు, రహదారి పరిస్థితులు, ఫీచర్ల వినియోగాన్ని బట్టి రియల్ రేంజ్ మారవచ్చు.