×
Ad

TVS Jupiter 110 : స్కూటర్ ప్రియులకు షాక్.. టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ ధరలు పెంపు.. పాత, కొత్త వేరియంట్ ధరలివే..

TVS Jupiter 110 : కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ ధరలు పెరిగాయి. వేరియంట్ల వారీగా ఏ మోడల్ స్కూటర్ ధర ఎంత పెరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

TVS Jupiter 110

  • టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ వేరియంట్ల ధరలు ఇవే
  • అన్ని జూపిటర్ 110 వేరియంట్లలో రూ.3,250 వరకు ధరలు
  • టీవీఎస్ జూపిటర్ 110 పాత, కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

TVS Jupiter 110 : కొత్త స్కూటర్ కోసం చూస్తున్నారా? మీరు టీవీఎస్ అభిమాని అయితే మీకో షాకింగ్ న్యూస్.. టీవీఎస్ జూపిటర్ స్టైలిష్ 110cc స్కూటర్ ధర భారీగా పెరిగింది. టీవీఎస్ మోటార్ కంపెనీ అన్ని జూపిటర్ 110 వేరియంట్లలో రూ. 3,250 వరకు ధరలను పెంచింది.

ఈ ధరల పెంపు స్టార్ సిటీ ప్లస్, రేడియన్, నాట్రోక్ 125తో సహా అనేక ఇతర టూవీలర్ మోడళ్లకు కూడా వర్తించనుంది. ఈ ధర పెంపుతో అనేక ఇతర టూవీలర్ వాహన మోడళ్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.

Read Also : Best AI Phones : కొత్త ఏఐ ఫోన్ కావాలా? రూ. 25వేల లోపు ధరలో 6 బెస్ట్ AI ఫోన్లు మీకోసం.. ఏ ఫోన్ కొంటారో మీదే ఛాయిస్..!

టీవీఎస్ మోటార్ సైకిళ్ళు, స్కూటర్లపై ధరలు పెంచడం కొత్తేమీ కాదు.. ఎందుకంటే.. దేశంలో అనేక ఇతర ఆటోమేకర్లు కూడా ముడిసరుకు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులతో తమ వాహనాల ధరలను భారీగా పెంచారు.

మీరు టీవీఎస్ జూపిటర్ 110 కొనాలని చూస్తుంటే.. ఇప్పుడు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ 110 పాత, కొత్త ధరలను వేరియంట్ వారీగా ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీవీఎస్ జూపిటర్ 110 వేరియంట్ల వారీగా ధరల వివరాలివే :

వేరియంట్లు పాత ధర (ఎక్స్-షోరూమ్) పెరిగిన ధర కొత్త ధర (ఎక్స్-షోరూమ్)
డ్రమ్ రూ. 72,650 రూ. 2,950 రూ. 75,600
డ్రమ్ అలైన్ రూ. 77,450 రూ. 2,385 రూ. 79,835
డ్రమ్ SXC రూ. 81,250 రూ. 2,750 రూ. 84,000
డిస్క్ SXC రూ. 84,750 రూ. 3,000 రూ. 87,750
స్పెషల్ ఎడిషన్ రూ. 85,650 రూ. 3,250 రూ. 88,900

టీవీఎస్ జూపిటర్ 110 ధర రూ. 3,250 వరకు :
టీవీఎస్ జూపిటర్ 110 ధర వేరియంట్‌ను బట్టి రూ. 2,950 పెరిగి రూ. 3,250కి చేరుకుంది. ఈ పెంపుతో బేస్ డ్రమ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 75,600 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గతంలో ధర రూ. 72,650 (ఎక్స్-షోరూమ్) కన్నా రూ. 2,950 ఎక్కువ.

టీవీఎస్ స్కూటర్ టాప్-ఎండ్ స్పెషల్ ఎడిషన్ మోడల్ గరిష్ట ధర రూ. 3,250 పెరిగింది. ఈ జూపిటర్ 110 టాప్-ఎండ్ వేరియంట్ ధర గతంలో రూ. 85,650 (ఎక్స్-షోరూమ్) ఉండగా ఇప్పుడు రూ. 88,900 (ఎక్స్-షోరూమ్)కు లభ్యమవుతోంది.