TVS Ntorq 150 : ఇది స్కూటర్ కాదు.. స్పీడ్ రాకెట్! టీవీఎస్ NTORQ 150 ఫీచర్లు అదుర్స్.. 6.3 సెకన్లలో 60కి.మీ రేంజ్!
TVS Ntorq 150 : భారత్‌లోనే ఫాస్టెస్ట్ స్కూటర్ వచ్చేసింది.. టీవీఎస్ నుంచి NTORQ 150 కొత్త స్కూటర్ అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఫీచర్లు, ధర పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Updated on- June 8, 2026 / 02:27 PM IST
TVS Ntorq 150
- సిటీ రైడర్ల కోసం టీవీఎస్ నుంచి ఫస్ట్ ఫాస్టెస్ట్ స్కూటర్
- బైకులను తలదన్నే ఫీచర్లతో టీవీఎస్ NTORQ 150 ఎంట్రీ
- గంటకు 104కిలోమీటర్ల టాప్ స్పీడ్, 6.3 సెకన్లలో 60కి.మీ రేంజ్
TVS Ntorq 150 : కొత్త స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి సూపర్ ఫాస్ట్ స్కూటర్ వచ్చేసింది. మైలేజీ, సౌకర్యం, రోజువారీ ప్రయాణాలకే కాదు.. వేగంలో కూడా బైకులను మించేలా టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త NTORQ 150 స్కూటర్ ఆవిష్కరించింది.
నగర ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్‌లతో పాటు పోటీపడే ఈ స్కూటర్.. గ్రీన్ లైట్ పడటమే ఆలస్యం.. క్షణాల్లో దూసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. కేవలం 6.3 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందిస్తుంది.
ప్రస్తుతం ఈ టీవీఎస్ స్కూటర్ మోడల్ భారత మార్కెట్లోనే అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా నిలిచింది. స్పీడ్, స్పోర్టీ డిజైన్, స్మార్ట్ టెక్నాలజీ కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకుని కంపెనీ మార్కెట్లోకి దించింది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
పెర్ఫార్మెన్స్‌లో హైపర్ స్పోర్ట్ :
టీవీఎస్ ఎన్టీఓఆర్య్యూ 150లో 149.7cc O3C టెక్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 13.2PS పవర్, 14.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ ఫాస్ట్ యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. సిటీ రోడ్లు లేదా హైవేలపైనా ఫాస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. టీవీఎస్ అందించే స్కూటర్లలో ‘హైపర్ స్పోర్ట్ స్కూటర్’అని చెప్పొచ్చు.
జెట్ ఫైటర్ మాదిరి డిజైన్ :
జెట్ ఫైటర్ మాదిరిగా డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఈ స్కూటర్ ఫస్ట్ లుక్ మొదటి చూపులోనే వినియోగదారులను ఆకట్టుకునే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మల్టీపాయింట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, షార్ప్ బాడీ లైన్స్, ఏరోడైనమిక్ వింగ్‌లెట్స్, నేకెడ్ హ్యాండిల్‌బార్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, స్పెషల్ సౌండ్ మఫ్లర్ రేసింగ్ డీఎన్‌ఏతో స్పెషల్ అట్రాక్షన్ అందిస్తాయి. బ్యాక్ సైడ్ ‘T’ షేప్ టెయిల్ ల్యాంప్ రాత్రివేళల్లో కూడా స్పెషల్ ఐడెంటిటీని అందిస్తుంది.
స్మార్ట్‌కనెక్ట్ అప్‌గ్రేడ్స్ :
టీవీఎస్ NTORQ 150 స్కూటర్‌లో హై-రిజల్యూషన్ టీఎఫ్టీ క్లస్టర్‌ను అమర్చారు. టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్ ద్వారా అలెక్సా ఇంటిగ్రేషన్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, కాల్-మెసేజ్ నోటిఫికేషన్లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, సోషల్ మీడియా అలర్ట్స్, OTA అప్‌డేట్స్ వంటి 50కిపైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. టీవీఎస్ స్కూటర్ అనేది కన్నా స్మార్ట్ గ్యాడ్జెట్ నడుపుతున్న ఫీల్ ఎక్కువగా అనిపిస్తుంది.
సేఫ్టీ సెగ్మెంట్ ఫీచర్లు :
స్కూటర్ రైడర్లకు సేఫ్టీ కోసం టీవీఎస్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో థెఫ్ట్ అలర్ట్స్, హజార్డ్ ల్యాంప్స్, క్రాష్ అలర్ట్స్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, ఫాలో-మీ హెడ్‌ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. అడ్జస్టబుల్ బ్రేక్ లీవర్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, 22 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా అత్యంత ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ధర ఎంతో తెలుసా? :
భారత మార్కెట్లో టీవీఎస్ (NTORQ 150)స్కూటర్ రూ.1.19 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ స్కూటర్ రేసింగ్ రెడ్, స్టెల్త్ సిల్వర్, టర్బో బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో స్టాండర్డ్ వేరియంట్ లభిస్తుంది. TFT క్లస్టర్ వేరియంట్ నైట్రో గ్రీన్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ కలర్ ఆప్షన్లలో లభించనుంది. స్టైల్, స్పీడ్, స్మార్ట్ ఫీచర్లతో కలిపి సింగిల్ ప్యాకేజీలో కోరుకునే యువతకు ఈ టీవీఎస్ స్కూటర్ అద్భుతంగా ఉంటుంది.
