Twitter Bird Logo : బుల్లిపిట్ట తిరిగొచ్చింది.. ట్విట్టర్‌‌ ‘డాగీ కాయిన్’ లోగో మార్చేశాడు.. మస్క్ మామూలోడు కాదుగా..!

Twitter Bird Logo : ట్విట్టర్ సొంత గూటికి బుల్లి పిట్ట తిరిగి వచ్చేసింది.. డాగీ కాయిన్ (Dogecoin) లోగోను ఎలన్ మస్క్ తొలగించాడు. 3 రోజుల తర్వాత మస్క్ మనసు మార్చుకున్నాడు. కుక్క లోగోను మార్చేసి ట్విట్టర్ అధికారిక బర్డ్ లోగోను ఉంచాడు.

Twitter Bird Logo : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈఓగా ఎలన్ మస్క్ (Elon Musk) తన చేష్టలతో ఎవరికీ అర్థం కానీ రీతిలో వ్యవహరిస్తున్నాడు. తెలిసి చేస్తున్నాడా? లేదా అందరిని ఫూల్స్ చేస్తున్నాడా అనిపించేలా ఉంది మస్క్ వ్యవహార శైలి. మూడు రోజుల క్రితం.. ట్విట్టర్ డెస్క్‌టాప్ లోగో (Twitter Desktop Logo) ను సడెన్‌గా మార్చేశాడు. అధికారిక లోగో బుల్లి పిట్ట స్థానంలో డాగీ కాయిన్ లోగో (Dogecoin Logo in Twitter) ను పెట్టాడు. మూడు రోజుల తర్వాత మనసు మార్చుకున్నాడు కాబోలు.. కుక్క లోగోను తొలగించి మళ్లీ ట్విట్టర్ లోగోను అదే స్థానంలో ఉంచాడు. అసలు, మస్క్ ఎందుకు ఇలా చేస్తున్నాడో ఎవరికి అంతుపట్టడం లేదు. ట్విట్టర్ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి మస్క్ వింతగా ప్రవర్తిస్తున్నాడు.

వాస్తవానికి.. ట్విట్టర్ బర్డ్ లోగోను పాపులర్ షిబా ఇనుగా పిలిచే డాగీ కాయిన్ లోగో (Dogecoin Logo)తో మస్క్ ఎందుకు మార్చాడు? దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, మస్క్ కేవలం డాగీ కాయిన్ (Dogecoin) మార్చడానికి కారణం లేకపోలేదు.. ఈ డాగీ కాయిన్ పెట్టుబడిదారులు తనపై 258 డాలర్ల దావా వేయకుండా వారి దృష్టిని మళ్లించడానికే ఇలా చేసి ఉంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగానే గ్రహించి మస్క్ ఇలా చేసి ఉండి ఉంటాడని భావిస్తున్నారు. ట్విట్టర్ లోగో మస్క్ మార్చేయగానే.. డాగీ కాయిన్ క్రిప్టోకరెన్సీ వాల్యూ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. మూడు రోజుల పాటు డాగీ కాయిన్ జోరు కొనసాగింది. ఆ తర్వాత  ట్విట్టర్ లోగోను మళ్లీ బుల్లిపిట్టగా మార్చేశాడు మస్క్.

Read Also : Twitter Blue Verified Tick : ట్విట్టర్ బ్లూ టిక్‌కు డబ్బులు చెల్లించేది లేదు.. తెగేసి చెప్పిన టాప్ కంపెనీలు, ప్రముఖులు.. ఎందుకో తెలుసా?

మరికొంత మంది మాత్రం మస్క్.. అందరిని ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే ఇలా చేసి ఉంటాడని భావించారు. అందుకు కారణం.. ఏదైనా కావచ్చు.. మళ్లీ బుల్లి పిట్ట ట్విట్టర్ లోగో స్థానంలోకి తిరిగి వచ్చింది. మస్క్ ఎప్పటిలానే.. డోజ్ లోగో కొన్ని గంటల పాటు మాత్రమే ఉంచుతాడని భావించారు. కానీ, అలా జరగలేదు. మస్క్ మాత్రం కుక్క లోగో దాదాపు మూడు రోజుల పాటు అలానే ఉంచాడు. ఎందుకు సీఈఓ మస్క్ ఇలా చేశారు అనేది కచ్చితంగా తెలియదు, కానీ మస్క్‌కి ఇది చాలా సాధారణమని చెప్పవచ్చు. ట్విట్టర్ లోగో వెబ్ వెర్షన్‌లో మాత్రమే డాగ్‌గా మార్చడం వెనుక మస్క్ ఉద్దేశం ఏంటి? అనేది ఆయనకే తెలియాలి అంటున్నారు.

Twitter Bird Logo (Photo Credit : Twitter/Google)

లోగోను ఇందుకే మార్చాడా? :
నిజానికి, ట్విట్టర్ బర్డ్ లోగోను డాగీ కోయిన్‌గా మార్చిన తర్వాత.. మస్క్ దానిపై జోక్ కూడా పేల్చాడు. బిలియనీర్ ఒక పాత స్క్రీన్‌షాట్‌ను కూడా ట్వీట్ చేశాడు. అందులో మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసి లోగోను డోజ్‌గా మార్చాలని ఒక యూజర్ సూచించినట్టుగా ఉంది. అతనికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇలా మస్క్ ట్విట్టర్ లోగోను మార్చినట్లు చెప్పాడు. అందులో కారు డ్రైవింగ్ సీటుపై కుక్క కూర్చొని ఉంటుంది. అదే సమయంలో కుక్కను లైసెన్స్‌ చూపించమని ట్రాఫిక్ పోలీసు అడుగుతాడు. అతడికి కుక్క ఒకటి చూపిస్తుంది. అందులో బ్లూ బర్డ్ లోగో (పాత లోగో) కనిపిస్తుంది. ఇది పాత ఫొటో అని డాగీ పోలీసులకు చెబుతున్నట్టుగా ఫన్నీగా పోస్టు పెట్టాడు మస్క్.

మస్క్ ట్విట్టర్ లోగో మార్చడం వెనుక ఇంత జరిగిందా?


ట్విట్టర్‌లో డాగీ లోగోను పెట్టడానికి కారణం ఏంటి? అనేదానిపై కూడా మస్క్ మరో ట్వీట్ చేశాడు. మస్క్ కొత్త ప్లాట్‌పారమ్ అవసరమా అని యూజర్ ను అడిగినట్టుగా ఉంది. దానికి యూజర్ రీట్వీట్ చేస్తూ.. ట్విటర్ కొనుగోలు చేయమని సూచించినట్టుగా ఉంది. అంతేకాదు.. బ్లూ బర్డ్ లోగోను మార్చేసి దాని స్థానంలో డాగీ లోగోను పెట్టండని సూచించినట్టుగా ఉంది. ట్విటర్ డాగీ కాయిన్ లోగోను మస్క్.. కేవలం డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మాత్రమే మార్చడం గమనార్హం. మొబైల్ యాప్‌లో మాత్రం బుల్లి పిట్ట లోగో అలానే కనిపించింది. ఇప్పుడు కుక్క లోగోను మార్చేసి అధికారిక పిట్ట లోగోనే మళ్లీ పెట్టాడు మస్క్.

ట్విట్టర్‌ ను గాడిలో పెట్టేందుకేనా? :  
బిలియనీర్ మస్క్.. ట్విట్టర్‌ను మళ్లీ లాభదాయకమైన కంపెనీగా మార్చే దిశగా కృషి చేస్తున్నాడు. మస్క్ కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుంచి.. దాని విలువ సగానికి పడిపోయి 20 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వాస్తవానికి.. ట్విట్టర్ కంపెనీని 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేశాడు. అన్నింటినీ నగదు రూపంలోనే చెల్లించాడు. ఆ తర్వాత ట్విట్టర్ లెగసీ అకౌంట్ల నుంచి బ్లూ టిక్‌లను తొలగించాడు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లించే యూజర్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుందని మస్క్ వెల్లడించాడు. భారతీయ ట్విట్టర్ యూజర్లు (Twitter Blue Tick) బ్లూ వెబ్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే.. నెలకు దాదాపు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ యూజర్లు బ్లూ టిక్ పొందాలంటే నెలకు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Twitter Logo Changed: పిట్ట పోయింది డాగ్‍‌‌ వచ్చింది..! ట్విటర్‌లో కనిపించని బ్లూ బర్డ్.. అయోమయంలో నెటిజన్లు..

ట్రెండింగ్ వార్తలు