Aadhaar QR Code : UIDAI కొత్త రూల్స్.. ఇక ఆధార్ జిరాక్స్ అడిగినా ఇవ్వొద్దు..! QR కోడ్ స్కాన్ చేస్తే చాలు!

Aadhaar QR Code : ఆధార్ క్యూఆర్ కోడ్ ఉంటేనే వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. కేవలం ఆధార్ జిరాక్స్ కాపీ ఇస్తే కుదరదు.. ఎవరైనా ఆధార్ కాపీలు అడిగినా ఇవ్వొద్దు.. క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే వెరిఫికేషన్ చేయగలరు.

Aadhaar QR Code

  • ఆధార్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ చేయలేరు
  • వెరిఫికేషన్ కోసం ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ మస్ట్
  • యాప్ ఆధారిత వెరిఫికేషన్ దేశవ్యాప్తంగా అమల్లోకి

Aadhaar QR Code : ఇక ఆధార్ జిరాక్స్‌తో పనిలేదు.. మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఆధార్ కార్డు ప్రింట్ తీసి జిరాక్స్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. UIDAI కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇప్పటినుంచి ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేయాలంటే క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే. ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వడం ద్వారా ఎక్కువగా దుర్వినియోగం జరుగుతుందని, వ్యక్తగత ప్రైవసీకి కూడా భంగం వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వం, యూఐడీఏఐ గుర్తించాయి.

ఇకపై ఇలాంటి ఇబ్బంది లేకుండా యాప్ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్ రూల్ తీసుకొచ్చింది. ఇప్పటినుంచి ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం జిరాక్స్ కాపీ ఇవ్వకుండా కేవలం యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. దేశీయ పౌరుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ఆధారిత క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Read Also : Flipkart June Epic Sale : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ సగం ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌‌లో ఇలా కొన్నారంటే?

ఆధార్ కాపీలు ఎవరికి ఇవ్వొద్దు :
ముఖ్యంగా ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలు, హోటళ్లు, గెస్ట్ హౌస్ వంటి ప్రదేశాల్లో ఆధార్ వెరిఫికేషన్ కోసం జిరాక్స్ కాపీలను ఇస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆధార్ దుర్వినియోగం జరుగుతోంది. అందుకే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు యాప్ ఆధారిత వెరిఫికేషన్ వెంటనే అమల్లోకి తేవాలని కేంద్రం సూచించింది.

కొత్త విధానం ప్రకారం.. :
ఆధార్ కార్డు ఫొటో కాపీ అక్కర్లేదు.. వెరిఫికేషన్ కోసం UIDAI యాప్ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఈ కోడ్ మొబైల్ ద్వారా స్కాన్ చేయగానే ఆధార్ యూజర్ పేరు, వయస్సు, మొబైల్ నంబర్, ఫొటో వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

ఈ క్యూర్ కోడ్ విధానం ద్వారా ఆధార్ సంబంధిత మోసాలకు చెక్ పడినట్టే. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు ఈ ఆధార్ వెరిఫికేషన్ యాప్ వినియోగిస్తున్నాయి. అలాగే ఆఫ్ లైన్ ఆధార్ వెరిఫికేషన్ చేసే సంస్థలు కూడా తప్పనిసరిగా యూఐడీఏఐలో రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.