Aadhaar ID Proof : UIDAI బిగ్ అప్‌డేట్.. ఆధార్ జస్ట్ వ్యాలీడ్ ఐడీ.. పుట్టిన తేదీకి ప్రూఫ్ కాదు.. ఏయే డాక్యుమెంట్లు చూపించాలంటే?
Aadhaar ID Proof : ఆధార్ పుట్టిన తేదీకి రుజువు కాదు.. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు పనికిరాదు.. ఏయే డాక్యుమెంట్లు పుట్టిన తేదీకి రుజువుగా చూపించవచ్చంటే?
- Sreehari A
- Published on- April 28, 2026 / 02:35 PM IST
Aadhaar ID Proof
- ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కాదు
- పుట్టిన తేదీకి ఈ డాక్యుమెంట్లే రుజువుగా చూపించాలి
- ఆధార్ అనేది ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ మాత్రమే
Aadhaar ID Proof : ఆధార్ కార్డుకు సంబంధించి కీలక అప్‌డేట్.. పుట్టిన తేదీ (DOB)కి ఆధార్ ఇకపై కచ్చితమైన రుజువు కాదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ కు వ్యాలీడ్ కాదు. ఇప్పటివరకు యూఐడీఏఐ జారీ చేసిన మీ ఆధార్ కార్డు అన్నిచోట్లా వాడొచ్చని అందరూ భావించారు. పుట్టిన తేదీకి ఆధార్ కార్డును పక్కా రుజువుగా చూపించలేమని యూఐడీఏఐ కీలక ప్రకటనలో తెలిపింది.
ఆధార్ అనేది మీ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ మాత్రమేనని, మీ వయస్సు లేదా పుట్టిన తేదీకి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్ కాదని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
భారత్‌లో బ్యాంకింగ్, స్కూల్ అడ్మిషన్లు, ప్రభుత్వ పథకాలు వంటి అన్ని రకాల ప్రయోజనాల కోసం చాలా కాలంగా ఆధార్‌ను వాడుతున్నారు.
ఈ అప్‌డేట్ తరువాత పుట్టిన తేదీ ఉన్నప్పటికీ ఆధార్ ఎందుకు వ్యాలీడ్ కావడం లేదని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఆధార్ వ్యాలీడ్ కాకపోతే, ఇంకా ఏ ఇతర డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆధార్ ‘పుట్టిన తేదీ రుజువు’గా ఎందుకు కాదు? :
ప్రధాన కారణం.. ఆధార్‌లో ఎంటర్ చేసిన పుట్టిన తేదీ పూర్తిగా వెరిఫై చేయకపోవడమే. యూఐడీఏఐ ప్రకారం.. తరచుగా సరైన డాక్యుమెంట్లు లేకుండా తమ పుట్టిన తేదీని చెబుతుంటారు.
అంటే అంచనా ఆధారంగా పుట్టిన తేదీని నమోదు చేస్తారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. ఆధార్‌లో నమోదు చేసిన పుట్టిన తేదీ పూర్తిగా కచ్చితమైనది కాకపోవచ్చు. ఈ కారణంగానే ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ప్రూఫ్ గా పరిగణించరు.
యూఐడీఏఐ మాత్రమే కాదు.. న్యాయస్థానాలు అనేక ప్రభుత్వ విభాగాలు కూడా ఆధార్ అనేది వయస్సు లేదా పుట్టిన తేదీకి కచ్చితమైన రుజువు కాదని స్పష్టం చేశాయి. అనేక సందర్భాల్లో, ఆధార్ కన్నా స్కూల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్లు లేదా డేట్ ఆఫ్ బర్త్‌డే డాక్యుమెంట్లు అత్యంత ముఖ్యం.
పుట్టిన తేదీకి రుజువుగా ఈ డాక్యుమెంట్లు అవసరం :
మీరు మీ పుట్టిన తేదీని ధృవీకరించాలంటే ఈ కింది వ్యాలీడ్ డాక్యుమెంట్లు తప్పనిసరి.
- జనన ధృవీకరణ పత్రం
- 10వ తరగతి మార్క్ షీట్ (SSLC)
- పాస్‌పోర్ట్
- ప్రభుత్వ అధికారి జారీ చేసిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ఆధార్‌లోని పుట్టిన తేదీ ఈ డాక్యుమెంట్ల ఆధారంగా వెరిఫై అవుతుంది. ఈ నిబంధన కొత్తదేమీ కాదు. కానీ, ఇప్పుడు యూఐడీఏఐ క్లారిటీ ఇచ్చింది.
గతంలో అందరూ దాదాపు అన్నింటికీ ఆధార్‌ను ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. సరైన పుట్టిన తేదీ రుజువు లేకుంటే భవిష్యత్తులో ముఖ్యమైన పనులకు ఆటంకం కలగవచ్చు.
