Gold Price Today : బంగారం కొనేవారికి గోల్డెన్ ఛాన్స్.. కొంటే గోల్డ్ ఇప్పుడు కొనడమే బెటర్.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
Gold Price Today April 28 : బంగారం కొనేందుకు చూస్తున్నారా? కొంటే ఇప్పుడే బంగారం కొని తెచ్చుకోండి. ఈరోజు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. మళ్లీ ధరలు పెరగకముందే కొనేసుకోవడం బెటర్.

Gold Price Today April 28 : బంగారం కొనేవారికి ఎగిరిగంతేసే వార్త.. పసిడి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు బంగారం కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేందుకు సరైన సమయంగా చెప్పొచ్చు. ఈ రోజు బంగారం ధరలపై ఓసారి లుక్కేయండి..

దేశంలో గోల్డ్ ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.71 తగ్గింది. ఆపై రూ.15,330 దగ్గర కొనసాగుతోంది. 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.65 తగ్గింది. ఆపై రూ.14,025 వద్ద కొనసాగుతోంది. ఈరోజు మంగళవారం (ఏప్రిల్ 28) దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు సహా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హైదరాబాద్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.710 తగ్గింది. ఆపై రూ.1,53,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 తగ్గింది. ఆపై రూ.1,40,250 వద్ద ట్రేడ్ అవుతోంది.

విజయవాడలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.710 తగ్గింది. ఆపై రూ.1,53,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 తగ్గింది. దాంతో రూ.1,40,250 ధర వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.710 తగ్గింది. ఆపై గోల్డ్ ధర రూ.1,53,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 తగ్గింది. దాంతో రూ.1,40,250 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,53,150 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

బెంగళూరులో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.710 తగ్గింది. దాంతో బంగారం ధర రూ.1,53,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 తగ్గి రూ.1,40,250 వద్ద ట్రేడ్ అవుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,53,820 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబైలో పసిడి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.710 తగ్గింది. ఆపై రూ.1,53,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 తగ్గింది. ఆపై రూ.1,40,250 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండిధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 5వేలు తగ్గి ప్రస్తుతం రూ. 2,65,000 వద్ద కొనసాగుతోంది.
