Buy a House or Stay on Rent (AI Image Credit To Original Source)
Union Budget 2026 : కొత్త ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? లేదా అద్దె ఇంట్లోనే ఉండిపోదాని ఫిక్స్ అయ్యారా? ఈ రెండింటిలో ఏది బెటర్? చాలామందికి సొంతిల్లు కల.. ఆ కల నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. అందులోనూ మధ్యతరగతి కుటంబాలు తమ ఆర్థిక స్థోమత లేకున్నప్పటికీ కొత్త ఇల్లు కొనాలని ఆశపడుతుంటారు.
అయితే ఈసారి బడ్జెట్ లో ఏమైనా వేతనపరులకు పన్నుపరంగా ఏమైనా ఉపశమనాలు ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ, ప్రభుత్వం బడ్జెట్‌లో గృహ రుణ వడ్డీపై ఎక్కువ పన్ను ప్రయోజనాలను అందించలేదు.
ఒకవేళ పన్ను తగ్గించి ఉంటే ఫస్ట్ టైమ్ ఇల్లు కొనుగోలు చేసేవారికి ఉమశమనం దక్కేది. కొత్త ఇల్లు కొనేందుకు ముందుకు వచ్చేవారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ రిలీఫ్ లేకపోవడంతో ఇల్లు కొనాలన్నా ఆలోచించాల్సి పరిస్థితి ఎదురవుతోంది.
ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఆస్తి ధరలు ఎక్కువగా ఉన్నాయి. అధిక వడ్డీ రేట్లు సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీలకు హోం లోన్ల ఈఎంఐల భారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బడ్జెట్‌లో ఏదైనా కొత్త ఉపశమనం ఉంటుందా? అని ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు బడ్జెట్ తర్వాత ఇల్లు కొనాలని ప్లాన్ చేయాలా? అద్దెకు ఉండటం బెటరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై నిపుణులు సింపుల్ గా సమాధానం ఇచ్చారు? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..
ఇల్లు కొనండి లేదా అద్దెకు తీసుకోండి :
ఇల్లు కొంటారా? లేదా అద్దెకు ఉంటారా? అనేది కేవలం నెలవారీ ఖర్చుల కోసమే కాదు. ఈ నిర్ణయం దీర్ఘకాలిక భద్రత, స్థిరత్వం, స్వాతంత్ర్యం, మనశ్శాంతిని అందిస్తుంది. ఇళ్ల ధరలు ఎక్కువగా ఉంటే అద్దెలు కూడా అలానే పెరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో కొనుగోలు, అద్దె రెండింటి లాభాలు, నష్టాలను అర్థం చేసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఇల్లు కొంటే కలిగే అతిపెద్ద బెనిఫిట్.. ఆ ఇల్లు మీ సొంతం అవుతుంది అంతే.. ఇది దీర్ఘకాలిక ఆస్తి. కాలక్రమేణా ఇంటి వాల్యూను పెంచుతుంది. ఇంటి అద్దె ద్వారా డబ్బులను సంపాదించుకోవచ్చు. గృహ రుణ ఈఎంఐలు సాధారణంగా స్టేబుల్‌గా ఉంటాయి. అయితే, ఇంటి అద్దె ప్రతి ఏడాది పెరుగుతుంది.
మీరు కోరుకున్న విధంగా మీ ఇంటికి ఏవైనా మార్పులు చేసుకోవచ్చు. ఇంటి యజమాని మిమ్మల్ని ఖాళీ చేయమని అడుగుతారనే ఆందోళన అవసరం లేదు. ఇల్లు కొనడం వల్ల దీర్ఘకాలిక ఆస్తులు పెరుగుతాయి. ఇంటి ధర పెరుగుదల, స్థిర ఈఎంఐలు, గృహ రుణాలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
ఇల్లు కొనడం అంటే భారీగా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, డౌన్ పేమెంట్ వంటి ప్రారంభ ఖర్చులు భారీగా ఉంటాయి. ఇంకా, మెయింట్ నెన్స్, మరమ్మతులకు కూడా మీరే ఖర్చు పెట్టాలి. ప్రారంభంలో ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. మెయింట్ నెన్స్ మీ ఆదాయం సరిపోతుంది. ప్రారంభ సంవత్సరాల్లో క్యాష్ ఫ్లోపై ఎఫెక్ట్ పడుతుంది.
20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల గృహ రుణాలు తీసుకుంటే అప్పుల ఊబిలో చిక్కుకున్నట్టే. అయితే ఉద్యోగపరంగా ఆదాయాలు, నగరాలు మారాల్సి వస్తుంది. అందులోనూ లోన్ పూర్తిగా తిరిగి చెల్లించే వరకు మీ ఇల్లు బ్యాంకులో తనఖా పెట్టి ఉంటారు. అవసరమైతే ఆస్తిని అమ్మేందుకు కూడా చాలా టైమ్ పడుతుంది. దాంతో తొందరగా మరో చోటుకు వెళ్లలేరు.
Read Also : Union Budget 2026 : బడ్జెట్ దెబ్బా? ఊరటా? సామాన్యుడి కథ ఇదే.. బడ్జెట్ తర్వాత జీతం చేతిలో నిలుస్తుందా?
అద్దెకు ఉంటే బెనిఫిట్స్ ఏంటి? :
అద్దెకు ఉంటే అతిపెద్ద ప్రయోజనం ఒకటే తక్కువ మొత్తంలో ఖర్చు ఉంటుంది. మీరు సెక్యూరిటీ డిపాజిట్, కొన్ని నెలల అద్దె మాత్రమే చెల్లిస్తారు. అద్దె ఇల్లు అనేది ఉద్యోగం, కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఏమైనా రిపేరింగ్, మెయింట్ నెన్స్ ఉన్నా ఇంటి యజమానే చూసుకుంటాడు. ఇంకా, ఆ ఇంటి ఆస్తి విలువ తగ్గినా అద్దెదారుడికి ఎలాంటి నష్టం ఉండదు.
నిపుణుల ప్రకారం.. “అద్దెతో మీ నెలవారీ ఖర్చులు కంట్రోల్ లో ఉంటాయి. అలాగే ఆఫీసుకు దగ్గరగా అద్దెకు ఉండొచ్చు. అవసరమైన చోటకు ఈజీగా మారిపోవచ్చు. జీతంలో ఖర్చులు పోనూ ఏమైనా మిగిలితే ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టవచ్చు. డబ్బు సంపాదన ప్రారంభంలో ఈ విధానం బాగా వర్కౌట్ అవుతుంది.
అద్దె చెల్లించడం వల్ల ఆస్తి పెరగదు. మీ జీతం పెరిగినా, పెరగకపోయినా, ప్రతి 11 నెలలకు మీ అద్దె పెరుగుతుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి ప్రాంతాలలో ఈ పెరుగుదల తరచుగా 10శాతం వరకు ఉంటుంది. అందులోనూ ఏదైనా ఇంటిని అద్దెకు తీసుకుంటే మీకు ఆ ఇంటిపై స్వేచ్ఛ కూడా ఉండదు.
చాలా మంది ఇంటి యజమానులు ఆలస్యంగా వచ్చినా లేదా పెంపుడు జంతువులను ఇంట్లోకి అనుమతించరు. లీజు ముగిసే సమయంలో ఇంటి యజమాని రూమ్ ఖాళీ చేయించడం లేదా అమ్మడం చేస్తుంటారు. ఎలాంటి రిటర్న్ లేకుండా అద్దెకు తీసుకుంటే దీర్ఘకాలంలో ఇల్లు కొనడం కన్నా భారంగా మారుతుంది.
ఎలా నిర్ణయించుకోవాలంటే? :
ఇల్లు కొనడం లేదా అద్దెకు ఉండటం అనే నిర్ణయం ఎప్పడూ ఒత్తిడిలో తీసుకోవద్దు. కానీ, ఆర్థికంగా నిలబడగలమా లేదా అని ఆలోచించి ఆ తర్వాత తీసుకోవాలి. అదే మీరు ప్రారంభ సంవత్సరాల్లో అద్దెకు ఇల్లు తీసుకుంటే క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతూ ఉండండి.
దానివల్ల కొంత మొత్తాన్ని సేవ్ చేయగలు. ఆదాయం స్థిరంగా ఉండాలి. ఈఎంఐ మీ ఇంటి బడ్జెట్‌లో సరిగ్గా సరిపోయినప్పుడు మాత్రమే ఇల్లు కొనాలి. ఇల్లు మీ సంపదను పెంచాలే కానీ మీ జీవితానికి భారంగా మారకూడదు.