Union Budget 2026 : బడ్జెట్ దెబ్బా? ఊరటా? సామాన్యుడి కథ ఇదే.. బడ్జెట్ తర్వాత జీతం చేతిలో నిలుస్తుందా?
Union Budget 2026 : మధ్యతరగతికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. అయితే, ఈసారి ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు లేకపోవడంతో జీతాలు పొందే ఉద్యోగుల్లో నిరాశే మిగిలింది.
Middle Class, nirmala sitharaman (Image Credit To Original Source)
Union Budget 2026 : బడ్జెట్ 2026పై మధ్యతరగతి ఆశలు ఆవిరయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాలు కురిపిస్తారనుకుంటే తీవ్ర నిరాశను మిగిల్చారు. ఈసారి బడ్జెట్ లో మధ్యతరగతి ఆశించిన ప్రకటనలు అందించలేదు.
దాంతో మధ్యతరగతి నెలవారీ జీతం పొందే ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. నెల తిరిగే సరికి చేతిలో చిల్లిగవ్వ ఉండటమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జీతాలపై పన్నులతో విసిగిపోయిన మధ్యతరగతి పన్నుచెల్లింపుదారులు ఈసారైన బడ్జెట్ లో ఆశించిన విధంగా పన్ను ఉపశమనం లభిస్తుందని భావించారు.
ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లింపులపై భారీగా ఉపశమనం ఉంటుందని ఆశిస్తే ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు. సామాన్యులు జీతంపై చెల్లించే పన్నుపై ఎలాంటి రిలీఫ్ దక్కలేదు.
మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక అంశాలపై ఫోకస్ పెట్టారు. మధ్యతరగతి ప్రజలకు సంబంధించి అనేక కీలక ప్రకటనలు చేశారు. అయితే, ఈసారి ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులను ప్రకటించలేదు. దాంతో జీతాలు పొందే ఉద్యోగులకు కొంత నిరాశను మిగిల్చింది.
ఉద్యోగస్తులకు ఐటీఆర్ ఈజీ :
ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకు సంబంధించి కీలక ప్రకటనలు లేవు. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో ఎలాంటి మార్పులు లేవు. అయితే, సవరించిన రిటర్న్‌లను దాఖలుకు మీకు 3 నెలల సమయం ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది.
మీ ఐటీఆర్ దాఖలు చేయడం గతంలో కన్నా చాలా ఈజీగా ఉంటుంది. వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు పన్ను ఉండదు. రూ. 75వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే పన్ను రహిత ఆదాయం రూ. 12,75,000కి పెరుగుతుంది. ఈ ఏడాదిలో పన్ను స్లాబ్‌లలో కొత్త మార్పు ప్రకటించలేదు.
వృద్ధులకు ఉపశమనం :
క్యాన్సర్ సంబంధిత 17 ఔషధాలపై ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ఎత్తేస్తుంది. దాంతో తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధులకు చికిత్స చౌకగా లభించనుంది. అడ్వాన్స్ క్యాన్సర్‌కు దిగుమతి చేసుకున్న మందులు కూడా చౌకగా లభించనున్నాయి. మూడు ఆయుర్వేద ఎయిమ్స్ స్థాపించింది. ఆయుర్వేద మందులను పరీక్షించేందుకు నేషనల్ ల్యాబరేటరీలను ఏర్పాటు చేయనుంది.
గృహిణులకు చేతినిండా ఆదాయం :
స్వయం సహాయక సంస్థలు లేదా షీ-మార్ట్స్, గ్రామీణ మహిళలు నేతృత్వంలోని సంస్థల కోసం ప్రారంభించబడతాయి. షీ-మార్ట్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం క్లస్టర్ స్థాయిలో, ముఖ్యంగా వ్యవసాయ-సమూహాలలో గ్రామీణ మహిళా వ్యవస్థాపకులకు మార్కెట్‌ను అందించడం. ఇది ప్రధానంగా మహిళలు మరియు స్వయం సహాయక బృందాలతో అనుబంధించబడిన దీదీల కోసం. ఇది మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది.
Read Also : Union Budget 2026 : ఈసారి బడ్జెట్లో టాక్స్ పేయర్లకు ఒరిగిందేంటి? నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే?
పిల్లల విదేశీ విద్యపై ఆదా :
మధ్యతరగతి కుటుంబంలో నుంచి మీ కుమార్తె ఎవరైనా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే దీనికి సంబంధించి 2026–27 కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యార్థులకు ప్రభుత్వం STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) విద్యకు ప్రాధాన్యత కల్పించింది. అంటే.. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లు నిర్మిస్తుంది. దేశంలో 700 జిల్లాలు ఉన్నాయి. మీ పిల్లలు విదేశాలలో చదువుకుంటే తల్లిదండ్రులు ఇప్పుడు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
విదేశీ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీలపై విధించే పన్ను వసూలు (TCS)ను ప్రస్తుత 5శాతం, 20శాతం నుంచి 2శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. విద్య, వైద్య ప్రయోజనాల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) చెల్లింపులపై టీసీఎస్ కూడా 5శాతం నుంచి 2శాతానికి తగ్గించనున్నారు.
అంతేకాదు.. పన్ను రిటర్నుల దాఖలు కూడా వాయిదా వేసింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జూలై 31 వరకు ITR-1, ITR-2 దాఖలు చేయవచ్చు. ఆడిట్ కాని వ్యాపారాలు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు సమయం లభిస్తుంది.
మైనారిటీ రిటైల్ పెట్టుబడిదారుల కోసం అన్ని బైబ్యాక్‌లను క్యాపిటల్ గెయిన్స్ గా పన్ను విధించాలని ప్రతిపాదించింది. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ వ్యక్తులకు ఇచ్చే వడ్డీని ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. దీనికి వర్తించే టీడీఎస్ కూడా తొలగించనుంది.
ఉద్యోగం, ఉపాధి అవకాశాలు :
ప్రభుత్వం మూలధన వ్యయాన్ని రూ. 12 లక్షల కోట్లకు పైగా పెంచింది. అంతేకాదు.. ఉద్యోగాల కల్పన కోసం పర్యాటకం, రైల్వే, పర్యాటక రంగాలకు కేటాయింపులు చేసింది. లాజిస్టిక్స్, టెక్నాలజీ రంగాలపై కూడా దృష్టి సారించింది.
ద్రవ్యోల్బణం నుంచి సామాన్యుడికి రిలీఫ్ :
ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు మోదీ ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, ఎలక్ట్రిక్ కార్లు, తోలు వస్తువులు, మైక్రోవేవ్ ఓవెన్లు, దుస్తులు వంటి వస్తువులు ఇప్పుడు చౌకగా లభిస్తాయి. వ్యక్తిగత వస్తువులపై పన్నులు కూడా తగ్గించింది. విమాన ప్రయాణం కూడా చౌకగా మారవచ్చు. ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్లు చౌకగా మారతాయి.
