Upcoming Cars in November 2026 : నవంబర్‌లో కార్ల జాతర.. రూ.10 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు 7 కొత్త మోడల్స్!
Upcoming Cars in November 2026 : నవంబర్ 2026లో భారత్‌లో మెర్సిడెస్ జీఎల్సీ ఎలక్ట్రిక్ డెన్జా D9, మహీంద్రా థార్ E, విన్‌ఫాస్ట్ VF3 సహా 7 కొత్త కార్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంచనా ధరలు, లాంచ్ వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- October 31, 2026 / 06:01 PM IST
- మెర్సిడెస్, మహీంద్రా, విన్‌ఫాస్ట్.. నవంబర్‌లో రాబోతున్న కార్ల లిస్ట్ ఇదే
- బడ్జెట్ కార్ల నుంచి లగ్జరీ EVల వరకు.. కొత్త కార్ల హంగామా
- నవంబర్‌లో ఏడు కొత్త కార్ల ఎంట్రీ.. ధరలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
Upcoming Cars in November 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్లో నవంబర్ 2026 మరింత ఆసక్తికరంగా మారనుంది. లగ్జరీ ఎలక్ట్రిక్ SUVల నుంచి బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల వరకు పలు కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చే ఎంట్రీ ఇవ్వనున్నాయి.
మెర్సిడెస్ బెంజ్, డెన్జా, మహీంద్రా, JSW మోటార్స్, హ్యుందాయ్, విన్‌ఫాస్ట్ వంటి కంపెనీలు ఈ నెలలో కొత్త కార్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి.. ఈ కార్ల ధరలు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉండొచ్చు. పూర్తి ఫీచర్లు, లాంచ్ ధర వివరాలివే..
1. మెర్సిడెస్ బెంజ్ GLC Electric :
లగ్జరీ SUV ప్రియుల కోసం మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ ఎలక్ట్రిక్ మోడల్‌ను నవంబర్ 4, 2026న లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో 94kWh బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ AWD సిస్టమ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే WLTP ప్రకారం.. సుమారు 715 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అత్యాధునిక డిజిటల్ డిస్ప్లేలు, ప్రీమియం ఇంటీరియర్, అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. అంచనా ఎక్స్‌షోరూమ్ ధర రూ.80 నుంచి రూ. 85 లక్షలుగా ఉండొచ్చు.
2. డెన్జా D9 :
లగ్జరీ ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్ BYD ప్రీమియం బ్రాండ్ డెన్జా నుంచి D9 ఎలక్ట్రిక్ MPV రాబోతుంది.. నవంబర్ 13, 2026న లాంచ్ అవకాశం ఉంది. ఈ కారు 7 సీటర్ లేఅవుట్‌తో ఫ్యామిలీలకు ఆకర్షణీయమైన ఆప్షన్. ఇందులో భారీ బ్యాటరీ ప్యాక్, కెప్టెన్ సీట్లు, మసాజ్ ఫంక్షన్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. సుమారు రూ.1 కోట్ల నుంచి రూ. 1.10 కోట్ల ధరతో భారత లగ్జరీ MPV మార్కెట్లో పోటీ ఇవ్వనుంది.
3. మహీంద్రా థార్ E :
ఆఫ్‌రోడ్ SUV ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా థార్.ఇ ఎలక్ట్రిక్ వెర్షన్ నవంబర్ 15న లాంచ్ కావచ్చని అంచనా.. సంప్రదాయ థార్ బాక్సీ డిజైన్‌కు ఎలక్ట్రిక్ టెక్నాలజీతో రానుంది. ఇందులో మోడ్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, అడ్వాన్స్ ఆఫ్‌రోడ్ సామర్థ్యాలు, డిజిటల్ ఇంటీరియర్ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చు.. అంచనా ధర రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలుగా ఉండొచ్చు. అయితే, ఈ మోడల్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉంది. నవంబర్ లాంచ్ అయ్యే అవకాశం లేదు..
4. JSW చెరీ iCar V23 :
విభిన్నమైన బాక్సీ డిజైన్‌తో JSW చెరీ ఐకార్ V23 ఎలక్ట్రిక్ SUV రాబోతుంది. నవంబర్ 15న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెట్రో లుక్, ఎత్తైన SUV స్టాన్స్, మోడ్రాన్ ఎల్ఈడీ లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్.. అంతర్జాతీయ వెర్షన్లో 2WD, AWD ఆప్షన్లు, డిజిటల్ టచ్‌స్క్రీన్, మోడ్రాన్ డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. భారత వెర్షన్లో బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్ వంటి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. అంచనా ఎక్స్‌షోరూమ్ ధర రూ.20 నుంచి 25 లక్షలుగా ఉండొచ్చు.
5. JSW జేకూ J5 ఈవీ :
కాంపాక్ట్ SUV విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు జేకూ J5 EV రెడీ అవుతోంది.. నవంబర్ 2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన SUV డిజైన్, వైడ్ క్యాబిన్, అడ్వాన్స్ టెక్నాలజీ మెయిన్ స్పెషాలిటీగా చెప్పొచ్చు.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లు ఉండవచ్చు. బ్యాటరీ, రేంజ్‌కు సంబంధించిన భారత వెర్షన్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అంచనా ధర సుమారు రూ.20 లక్షలుగా ఉండొచ్చు.
6. హ్యుందాయ్ HE1i కంపాక్ట్ ఈవీ :
బడ్జెట్లో ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునేవారికి హ్యుందాయ్ HE1i అద్భుతమైన కారు.. సుమారు రూ.10 లక్షల ప్రారంభ ధరతో ఈ కాంపాక్ట్ ఈవీ రాబోతుంది. ఇందులో మోడ్రాన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డిస్ప్లే, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, అడాస్ వంటి టెక్నాలజీ ఫీచర్లు ఉండవచ్చని అంచనా. సిటీ ప్రయాణాలతో పాటు రోజువారీ అవసరాలకు అనువుగా ఈ కారు ఉండనుంది. అయితే లాంచ్ తేదీపై క్లారిటీ లేదు, 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
7. విన్‌ఫాస్ట్ VF3 :
చిన్న సైజులో స్టైలిష్ ఎలక్ట్రిక్ కారు కొనేవారిని ఆకట్టుకునేందుకు విన్‌ఫాస్ట్ VF3 రెడీ అవుతోంది. ఈ మినీ ఎలక్ట్రిక్ SUV నవంబర్ 25, 2026న లాంచ్ అవకాశం ఉంది. బాక్సీ డిజైన్, కాంపాక్ట్ బాడీ, ఈజీ పార్కింగ్, సిటీ డ్రైవింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మోడ్రాన్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. అంచనా ధర సుమారు రూ.10 లక్షలుగా ఉండొచ్చు. చిన్న సైజు కారణంగా సిటీ ప్రయాణాలకు పర్ఫెక్ట్ కారు..
