Gold Price Fall : బంగారం, వెండి కొనేవారికి బిగ్‌న్యూస్.. అక్టోబర్‌లో పతనమైన ధరలు.. నవంబర్లోనూ అంతేనా..! కారణాలివే..
Gold Price Fall in October : అక్టోబర్‌లో బంగారం ధరలు 3.5 శాతం, వెండి ధరలు 14 శాతానికి పైగా తగ్గాయి. నవంబర్ నెలలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Why Gold Is Down 3 5 Percentage And Silver Plunges Over 14 Percentage In October
Gold Price Fall: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కీలక పరిణామాలు వెలువడుతున్నాయి. గత కొన్ని నెలలుగా భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు అక్టోబర్ నెలలో పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఈ నెలలో సుమారు 3.5 శాతం తగ్గగా.. వెండి ధర ఏకంగా 14 శాతానికి పైగా పతనమైంది.
నవంబర్ నెలలో ధనత్రయోదశి, దీపావళి పండుగలు రానున్నాయి. ఈ పండుగల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు బంగారం, వెండి కొనుగోళ్లు జరిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాస్తవానికి పండుగల సమయంలో గోల్డ్ రేటు అమాంతం పెరుగుతుండటం చూస్తుంటాం. అయితే, అక్టోబర్ నెలలో దసరా పండుగ సమయంలోనూ.. ప్రస్తుతం గోల్డ్ రేటు తగ్గుతూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ గోల్డ్, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ విపణిలో శుక్రవారం స్పాట్ గోల్డ్ ధర 0.2 శాతం దిగొచ్చి 3990 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక, వెండి ధర కూడా 0.4 శాతం తగ్గి 50.98 శాతం వద్ద కొనసాగుతోంది. శుక్రవారం కూడా గోల్డ్, సిల్వర్ ధరలు అంతర్జాయంగా, భారతదేశంలో భారీగా తగ్గాయి.
గోల్డ్ ధరలు ఈ స్థాయిలో పతనం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ట్రెజరీ బాండ్లపై ప్రతిఫలాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను తరలిస్తున్నారు. ఇక, అమెరికా ఫెడ్ రిజర్వ్ డిసెంబరులోనూ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా డాలర్ విలువ పెరగడం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపిస్తోంది. మరోవైపు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ భయాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ పరిణామాలు బంగారం, వెండి ధరలపై ఒత్తిడికి కారణమవుతున్నాయి.
బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో ఎక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయి. వెండికి పెట్టుబడుల రూపంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలోనూ డిమాండ్ ఉంటుంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర పరిశ్రమల్లో వెండిని ఉపయోగిస్తారు. అయితే ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, డాలర్ బలోపేతం, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు వెండిపై మరింత ప్రభావం చూపుతున్నాయి. దీంతో అక్టోబర్‌లో వెండి ధర 14 శాతానికి పైగా పడిపోయింది.
రానున్న రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు బంగారం, వెండి ధరలకు కీలకం కానున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం తగ్గి వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బలహీనపడితే పసిడి ధరలు కోలుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు డాలర్ మరింత బలపడితే, ముడిచమురు ధరలు అధికంగా కొనసాగితే బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చు.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినంత మాత్రాన భారత్‌లోనూ అదే స్థాయిలో తగ్గుతాయని చెప్పలేం. రూపాయి-డాలర్ మారకం విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు దేశీయ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
