Update PF KYC : ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. ఇకపై ఇంట్లోనే మీ PF కేవైసీ ఈజీగా అప్‌డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Update PF KYC : ఈపీఎఫ్ఓ (EPFO) సభ్యులకు బిగ్ అప్ డేట్.. పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి కీలక పీఎఫ్ సమాచారాన్ని ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈజీగా అప్ డేట్ చేసుకోవచ్చు. 

Update PF KYC Online

  • మీ పీఎఫ్ ఖాతాలో కేవైసీ పూర్తి చేయలేదా?
  • ఆన్ లైన్ లోనే ఈజీగా పీఎఫ్ కేవైసీని అప్ డేట్ చేయొచ్చు
  • పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Update PF KYC : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఇకపై మీ పీఎఫ్ క్లెయిమ్ రిజక్ట్ అవ్వదు. చాలా ఈజీగా మీ పీఎఫ్ అకౌంట్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లక్షలాది మంది సభ్యులకు బిగ్ రిలీఫ్ అందించింది.

పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి ముఖ్యమైన పీఎఫ్ వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈజీగా (Update PF KYC) అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యంతో పీఎఫ్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం గానీ, ఎలాంటి ఫారమ్‌లను నింపాల్సిన పని గానీ ఉండదు. ఈ సౌకర్యం UAN పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంది.

వాస్తవానికి.. పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేందుకు ముఖ్య కారణం.. ఆధార్, ఈపీఎఫ్ రికార్డుల మధ్య డేటా మ్యాచ్ కాకపోవడమే. మీ పేరులో ఒక చిన్న అక్షర దోషం లేదా పుట్టిన తేదీలో తేడా ఉన్నా కూడా క్లెయిమ్ ప్రాసెస్ ఆగిపోవచ్చు. ఈ సమస్యను నివారించేందుకు ఈపీఎఫ్ఓ ​​ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా డిజిటలైజ్ చేస్తోంది.

Read Also : Tech Tips Telugu : ఐఫోన్లలో బ్యాటరీ సమస్యా..? ఐఫోన్ యూజర్లు ఇలా చేయండి.. ఆన్ కాకపోతే ఈ ట్రిక్ ట్రై చేయండి..!

పీఎఫ్ KYCని ఎలా అప్‌డేట్ చేయాలి? :

  • ఆన్‌లైన్ కరెక్షన్ కోసం ఈ సింపుల్ మెథడ్స్ ఫాలో అవ్వండి.
  • ముందుగా UAN పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
  • Manage సెక్షన్ వెళ్లి ప్రాథమిక వివరాలను Edit ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆధార్ ప్రకారం మీ వివరాలను అప్ డేట్ చేయండి.
  • (Update)పై క్లిక్ చేసి, (Request) సమర్పించండి.
  • ఆ తర్వాత మీ కంపెనీ ఆన్‌లైన్‌లో అప్రూవల్ చేయాల్సి ఉంటుంది.
  • అప్రూవల్ వచ్చాక మీ వివరాలు EPF ఖాతాలో అప్‌డేట్ అవుతాయి.

ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? :

  • ఆధార్, UAN లింక్ తప్పనిసరి
  • పాన్ కార్డు, బ్యాంకు వివరాలు సరిగ్గా అప్‌డేట్ చేయాలి.
  • మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి.

చాలా మార్పులకు కంపెనీ ఆమోదం అవసరమని గమనించాలి. అయితే, మీరు బ్యాంకు ఖాతా, IFSC వివరాల వంటి డేటాను మీరే అప్‌డేట్ చేసుకోవచ్చు.

కేవైసీ అప్‌డేట్ ఎందుకంటే? :
మీ కేవైసీ అసంపూర్తిగా ఉంటే.. పీఎఫ్ విత్‌డ్రా చేయడం కష్టమవుతుంది. ఈపీఎఫ్‌ఓ ఇప్పుడు మొత్తం డేటాను ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది. అందుకే చిన్న పొరపాటు కూడా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వొచ్చు.