UPI Charges : యూపీఐ ఛార్జీలపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే.. వీళ్లకు ప్రాబ్లం ఉండదు.. కానీ..

UPI Charges : నగదు రహిత చెల్లింపుల్లో అత్యంత కీలకంగా మారిన యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అంశాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

UPI Charges

UPI Charges : నగదు రహిత చెల్లింపుల్లో అత్యంత కీలకంగా మారిన యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి రూ.2వేల కంటే ఎక్కువ విలువైన పీ2ఎం (Person To Merchant) యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీని విధించనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. అయితే, అవి వ్యాపార సంస్థలకే వర్తిస్తాయని కేంద్రం చెబుతున్నప్పటికీ.. చివరికి సామాన్యలపైనే ఈ మొత్తం భారం పడే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం.. యూపీఐ ఛార్జీలు ఎలా పడుతాయి..? ఎవరు కట్టాలనే విషయాలను పరిశీలిస్తే.. సామాన్యులపై భారం పడనప్పటికీ.. వాటిని వ్యాపారులు తమ కస్టమర్లపై బదిలీ చేయకుండా చూసుకోవాలని బ్యాంకులకు కేంద్రం సూచించింది. అయితే, ఇది ఏమేరకు ఆచరణ సాధ్యమో పెద్ద ప్రశ్నగా మారింది.

Also Read : Jio-Canva Offer : జియో యూజర్లకు కాన్వా బంపర్ ఆఫర్.. 12 నెలలు Canva Pro ఉచితం.. ఎలా పొందాలంటే?

కొత్త నిబంధనల ప్రకారం.. మీ స్నేహితుడికి రూ.50వేలు యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తే.. వాటిపై ఎలాంటి ఎండీఆర్ చార్జీలు పడవు. ఎందుకంటే అలాంటి లావాదేవీలు వ్యక్తిగత బదిలీ కిందకు వస్తాయి. ఇలాంటి లావాదేవీలపై ఎంతమొత్తమైనా సరే ఎలాంటి రుసుములు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.

మీరు పెట్రోల్ బంక్‌కు వెళ్లి రూ.3వేలు పెట్రోల్ లేదంటే డీజిల్ కొట్టించుకొని.. ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా బదిలీ చేస్తే అట్టి లావాదేవీలపై రూ. 5 రుసుము వర్తిస్తుంది. అయితే, ఆ మొత్తాన్ని వినియోగదారుడు కట్టాల్సిన పనిలేదు. ఒకవేళ మీరు రూ.50వేల విలువైన ఫోన్ కొనుగోలు చేస్తే.. ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారనుకోండి.. కేంద్రం ప్రకటించిన ఎండీఆర్ రేటు 0.4శాతం ప్రకారం.. ఈ లావాదేవీకి రూ. 200 రుసుము పడుతుంది. ఆ మొత్తాన్ని కొనుగోలుదారుడు చెల్లించాల్సిన పనిలేదు. మీకు ఫోన్‌ విక్రయించిన వ్యాపారి నుంచి ఆ ఛార్జీని బ్యాంకులు లేదంటే పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు వసూలు చేస్తాయి. ఇదే విషయాన్ని కేంద్రం క్లారిటీగా స్పష్టం చేసింది. రూ.2000లకు మించిన లావాదేవీలపై రుసుములు వ్యాపార సంస్థలకే వర్తిస్తాయని చెప్పింది.

అసలు సమస్య ఇక్కడే..!
యూపీఐ చెల్లింపుల సమయంలో కస్టమర్లపై ఎండీఆర్ ఛార్జీలు పడవని కేంద్రం చెబుతున్నప్పటికీ.. వ్యాపార సంస్థలు ఆ మొత్తాలను కస్టమర్ల నుంచి వసూళ్లు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ప్రశ్నగా మారింది. ఎండీఆర్ ఛార్జీలను వ్యాపారులు తమ కస్టమర్ల నుంచి వసూళ్లు చేయకుండా చూసుకోవాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. యూపీఐ అప్లికేషన్ ప్రొవైడర్లు వినియోగదారులపై ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా అంతర్గత ఛార్జీలను విధించడంపై నిషేధం ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో స్పష్టం చేశారు. కానీ, ఇది ఎంతవరకు అమల్లో సాధ్యమనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని వ్యాపార సంస్థలు క్రెడిట్‌ కార్డులతో చెల్లింపులు చేసే కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. కానీ, ఆ ఛార్జీలను కస్టమర్లు చెల్లించాల్సిన పనిలేదు. వీటిపై ఎక్కడా నియంత్రణ లేదు. ఇప్పుడు ఎండీఆర్‌ ఛార్జీలు అమల్లోకి వస్తే ఆ భారం వినియోగదారులపై వేస్తారనే ఆందోళనలు సామాన్య ప్రజల్లో ఉన్నాయి. మొత్తానికి సామాన్యులపై ఎండీఆర్ ఛార్జీలు పడవని కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఏ మేరకు క్షేత్ర స్థాయిలో అమల్లో ఉంటుందనేది కొనుగోలుదారుల్లో నెలకొన్న ఆందోళన.