Central Employees (Image Credit To Original Source)
Central Employees : సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ‘కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీ’పథకాన్ని జనవరి 14న ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు అధికారికంగా ప్రారంభించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, జాతీయ బ్యాంకుల ఎండీలు, సీఈఓలు, సీనియర్ డీఎఫ్ఎస్ అధికారులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు.
అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకానికి సంబంధించి అన్ని ప్రయోజనాలను అందించాలని ఆర్థిక సేవల విభాగం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో ఈ పథకం ద్వారా కేంద్ర ఉద్యోగులకు ఒకే శాలరీ అకౌంటులో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కార్డ్ ప్రీమియం బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.1.5 కోట్ల వరకు ప్రమాద బీమా, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీ ఏంటి? :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఒకే అకౌంటు ద్వారా పొందవచ్చు. వేర్వేరు ప్రదేశాలకు ప్రయాణాలు ఉండవు. గ్రూప్ A, B, Cలతో సహా అన్ని వర్గాల ఉద్యోగుల కోసం కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. ఇప్పుడు, జీతం అకౌంటుతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కార్డుల ప్రయోజనాలను పొందవచ్చు.
Read Also : Vivo Y400 5G : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. వివో Y400 5Gపై బ్రహ్మాండమైన డిస్కౌంట్.. ధర రూ. 20వేల లోపే..!
సింగిల్ అకౌంట్, మరెన్నో ప్రయోజనాలు :
ప్రభుత్వ విక్షిత్ భారత్ 2047 నాటికి అందరికి ఇన్సూరెన్స్ అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ పథకంలో బ్యాంకింగ్, బీమా, కార్డు సేవలు ఒకే అకౌంటులో పొందవచ్చు. కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీలో మొత్తం మూడు అంశాలు ఉంటాయి. అందులో ఒకటి బ్యాంకింగ్ సౌకర్యాలు, బీమీ కవరేజ్, డిజిటల్, కార్డు బెనిఫిట్స్.. ఇవన్నీ ఒకే చోట పొందవచ్చు.
బ్యాంకింగ్ సౌకర్యాలివే :
పథకం కింద బీమా కవరేజ్ :
Unified Salary Account for Central Employees with Insurance (Image Credit To Original Source)
డెబిట్, క్రెడిట్ కార్డ్ ఫీచర్లు బెనిఫిట్స్ :
మీరు మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు :
ఈ కొత్త పథకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. ఈ పథకం గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ విభాగాలు అవగాహన శిబిరాలను నిర్వహించాలని సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఇప్పటికే శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగులు కూడా కొత్త ‘కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీ’కి మార్చుకోవచ్చు.