ఇరాన్.. అమెరికాల మధ్య యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చమురు ఉత్పత్తులకు ప్రధాన కేంద్రమైన ఇరాన్‌కు నష్టం వాటిల్లితే ధరలు కచ్చితంగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ప్రపంచంలో మూడో వంతు ఆయిల్ ఉత్పత్తుల అవసరాలు తీరుస్తున్న ఇరాన్.. యుద్ధానికి వెళ్తే భారీ నష్టాన్ని చవిచూడాల్సిందే.
యుద్ధం జరగడమేమో కానీ, ఇప్పటికే చమురు ధరలు 3.5శాతం పెరిగిపోయాయి. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా.. ఇదే వాతావరణం కనిపిస్తుంది. గతంలో డ్రోన్‌తో అటాక్ జరిగినప్పుడు ధరలు అమాంతం పెరిగి మళ్లీ అదుపులోకి వచ్చాయి. ఈ సారి పరిస్థితి మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం.
ట్రంప్, ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటం నిజం. ఇరాన్ ఏదైనా ముందుజాగ్రత్తలు తీసుకుంటే అదుపులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు త్వరగానే నియంత్రణలోకి వచ్చేస్తాయి. 2019లో సౌదీ అరేబియాలో దాడి జరిగినప్పుడు ఇరాన్‌కు వ్యతిరేకంగా ట్రంప్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
అమెరికా తర్వాత వేయబోయే అడుగుపైనే అంతా ఆధారపడి ఉంది. సౌదీ అరేబియాలో ప్రమాదం తర్వాత సౌదీ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు సగం తగ్గిపోయాయి. దీనికి బాగ్దాద్‌లో ఇరాన్ జనరల్ ఖాసిం సొలైమనీ మరణానికి చాలా వ్యత్యాసముంది. ఇలా చూస్తే ఇరాన్ ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదు.