Gold Price Drops : 40 ఏళ్లలో ఇదే తొలిసారి.. రూ.29 వేలు దిగి వచ్చిన బంగారం ధర

Gold Price Drops : అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి బంగారం ధర భారీగా తగ్గతూ వస్తోంది. 24 రోజుల వ్యవధిలోనే రూ.29 వేలు తగ్గింది.

us iran war effect gold price drops rs 29000 in 24 days a 18 percent decline

Gold Price Drops : యుద్ధం ప్రారంభం ముందు వరకు కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో చాలా మంది పసిడిని సురక్షిత పెట్టుబడిగా భావించి.. పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. అలాంటి వారికి యుద్ధం భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్-అమెరికా యుద్ధం బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి భారీగా నష్టాలు మిగుల్చుతోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి బంగారం ధర భారీగా పడిపోయింది. యుద్ధం మొదలైన 24 రోజుల్లో పది గ్రాముల బంగారం ధర భారీగా దిగి వచ్చింది. 18 శాతం అంటే 29 వేల రూపాయలు తగ్గింది. పసిడిలో పెట్టుబడి పెట్టే వారికి ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు.

సాధారణంగా యుద్ధం, క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోతే.. బంగారం ధర పెరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. దీనికి ప్రధాన కారణం యుద్ధం వేళ డాలర్ బలపడటం. యుద్ధం, క్రూడ్ ధరలు భారీగా పెరగడం, రూపాయి క్షీణత వంటి అంశాల వలన బంగారం ధరలు పెరగాలి. కానీ, ఈసారి తగ్గాయి. దీనికి కారణం డాలర్ బలపడటం. ఒకవైపు డాలర్ బలపడటం మరోవైపు రూపాయి పడటంతో బంగారం రేటు ఎక్కువగా ఉంది. ఫలితంగా కొనుగోళ్లు తగ్గిపోయాయి.

యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను 3.5–3.75 శాతం వద్ద ఉంచడంతో బాండ్ యీల్డ్స్ పెరుగుతున్నాయి. బాండ్లకు డిమాండ్ పెరగడంతో.. బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ప్రస్తుతం పది గ్రాముల బంగారం రూ. 1.35 లక్షలకు దిగివచ్చింది. వెండి ధర కేజీకి 9 శాతం పడిపోయి.. రూ. 2,06,441కి దిగి వచ్చింది. బంగారం ధరలు ఈ ఏడాది జనవరిలో ఆల్ టైమ్ రికార్డ్ హైకి చేరుకుని.. రూ. 1.93 లక్షలు పలికింది. ఆ తర్వాత నుంచి పడిపోయింది.

సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 9,050 తగ్గి రూ. 1.43 లక్షలకు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. కిలో వెండి రూ. 10,500 తగ్గి రూ. 2.30 లక్షల వద్ద స్థిరపడింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ 5 శాతం పడిపోయి 4,263 డాలర్లకు చేరింది. గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు వారంలోనే 10 శాతం మేర పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ. 10,300 తగ్గి రూ. 1,35,600లకు చేరింది. కిలో వెండి రేటు రూ. 20 వేలు తగ్గి రూ. 2.30 లక్షలు అయింది.