Summer AC Tips : ఈ వేసవిలో AC తెగ వాడేస్తున్నారా? మీ ఏసీ ఏ క్షణమైనా పేలొచ్చు జాగ్రత్త.. ఎలా నివారించాలంటే? ఫుల్ డిటెయిల్స్
Summer AC Tips : ఎండాకాలంలో అదేపనిగా ఏసీలు వాడితే తొందరగా కాలిపోవడం లేదా మంటలు అంటుకోవడం వంటి అగ్నిప్రమాదాలు జరగవచ్చు. ఎలా నివారించాలంటే?
- Sreehari A
- Published on- April 28, 2026 / 05:53 PM IST
Summer AC Tips
- ఏసీలు అధికంగా వాడితే మంటలు చెలరేగే రిస్క్ ఎక్కువగా ఉంటుంది
- రిఫ్రిజెరెంట్ లీకేజీ కూడా ఏసీ పేలుడుకు మరో కారణం
- సర్వీసింగ్ సరిగా చేయించకపోయినా కూడా ఏసీలు కాలిపోవచ్చు
- ఏసీ హీటింగ్, అగ్ని ప్రమాదాల రిస్క్ తగ్గాలంటే ఇలా చేయండి
Summer AC Tips : ఎండలు మండిపోతున్నాయి.. ఏసీలు, కూలర్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు చాలామంది కొత్త ఏసీలు తెగ కొనేస్తున్నారు. అలాగే పాత ఏసీలను కూడా అదేపనిగా వాడేస్తున్నారు.
ఈ సమ్మర్ సీజన్‌లో మనలో చాలా మందికి ఏసీ నిత్య అవసరంగా మారుతుంది. ఫ్యాన్లు కూడా కంట్రోల్ చేయలేని స్థాయికి (Summer AC Tips) ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం కునుకు తీయడం నుంచి రాత్రి హాయిగా నిద్రపోవడం వరకు ఏసీలు ఎక్కువ సమయం రన్ అవుతునే ఉండాల్సి వస్తోంది.
కొంచెం కూడా గ్యాప్ లేకుండా రోజుంతా ఏసీని ఆన్ చేయడం వల్ల ఏసీ యూనిట్లు మంటలు అంటుకోవడం లేదా పేలిపోవడం వంటి ఘటనలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏసీ వాడకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
చాలా వరకు ఏయే కారణాల వల్ల ఏసీలు కాలిపోవడం లేదా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి జాగ్ర్తతలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం..
ఏసీ యూనిట్లకు మంటలు అంటుకోవడానికి కారణాలివే :
అతి సాధారణ కారణాలలో ఒకటి.. మితిమీరిన ఏసీ వాడకం. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది తమ ఏసీలను గ్యాప్ లేకుండా ఎక్కువ గంటలు నడుపుతారు. ఈ నిరంతర వాడకం వల్ల లోపలి భాగాలు బాగా వేడెక్కి పేలుడు జరిగే అవకాశం పెరుగుతుంది.
రిఫ్రిజెరెంట్ లీకేజీ మరో కారణం :
మీ ఏసీలోని గ్యాస్ కూలింగ్ కోసం చాలా అవసరం. కానీ, అందులో లీకేజీ ఉంటే.. టెంపరేచర్ పెరగకుండా ఉండేందుకు సిస్టమ్ మరింత కష్టపడాల్సి వస్తుంది. ఈ అదనపు భారం యూనిట్‌ను మరింత హీట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏసీ పేలుడు సంభవించవచ్చు.
ముఖ్యంగా పవర్ సప్లయ్ తక్కువగా ఉండే ప్రాంతాలలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు కూడా మెయిన్ ఇష్యూ. వోల్టేజ్‌లో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల ఏసీ లోపల సున్నితమైన భాగాలను దెబ్బతీస్తాయి. కాలక్రమేణా, పవర్ కట్ లేదా షార్ట్ సర్క్యూట్‌లకు దారితీయవచ్చు.
ఏసీ పేలుడు ప్రమాదాలను ఎలా నివారించాలి? :
- ఏసీ సేఫ్ ఉండాలంటే రెగ్యులర్ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి.
- వేసవిలో మీ ఏసీని నిపుణులతో చెక్ చేయించండి.
- గ్యాస్ లీక్‌లు, దెబ్బతిన్న పార్టులు లేదా లూజ్ వైరింగ్ ఫిక్స్ చేయించండి.
- వోల్టేజ్ స్టెబిలైజర్‌ను అమర్చండి. పవర్ సప్లయ్ కంట్రోల్ చేయండి.
- ఎయిర్ ఫిల్టర్లను క్లీన్ ఉంచుకోవడం కూడా ముఖ్యం.
- మురికి ఫిల్టర్లు ఎయిర్ ఫ్లో అడ్డుకుంటాయి.
- ఏసీ కూలింగ్ తగ్గి తొందరగా వేడెక్కి రిస్క్ పెరుగుతుంది.
- ప్రతి కొన్ని గంటలకు ఏసీని కాసేపు స్విచ్ ఆఫ్ చేయండి లేదా టైమర్ సెట్ చేయండి.
- ఏసీ యూనిట్ ఆఫ్ చేయడం ద్వారా వేడెక్కడం నివారించవచ్చు. లైఫ్ టైమ్ పెంచుకోవచ్చు
- అవుట్‌డోర్ యూనిట్‌కు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.
- వేడి ఈజీగా బయటకు పోయేలా ఓపెన్ ప్లేసుల్లో మాత్రమే ఉంచాలి.
