Visa Passkey : వీసా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక OTP, పాస్‌వర్డ్‌ అక్కర్లేదు.. జస్ట్ పాస్‌కీతోనే పేమెంట్లు..!

Visa Passkey : వీసా యూజర్లకు కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఓటీపీ, పాస్ వర్డ్ ల అవసరం ఉండదు. కేవలం పాస్ కీల ద్వారానే పేమెంట్లు ఈజీగా చేసుకోవచ్చు.. అది ఎలాగంటే?

Visa Passkey

Visa Passkey : వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారత్‌లో వీసా (Visa) కొత్తగా ‘వీసా పేమెంట్ పాస్‌కీ’ అనే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఆన్‌లైన్ కార్డ్ పేమెంట్లలో ఓటీపీలతో పనిలేదు. అలాగే ఎలాంటి పాస్ వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటినుంచి వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న బయోమెట్రిక్ ద్వారా ఫింగర్ ఫ్రింట్, ఫేస్ అథెంటికేషన్ లేదా పిన్/ప్యాటర్న్ ద్వారా లావాదేవీలను వెరిఫై చేసుకోవచ్చు.

ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వినియోగించే FIDO సేఫ్టీ సాండర్డ్స్‌పై ఆధారపడి ఉంటుంది. ముందుగా IDFC ఫస్ట్ బ్యాంక్‌తో ప్రారంభం కాగా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఆ తర్వాత మింత్రా, పేటీఎం, మేక్ మై ట్రిప్, టాటా స్టార్ బక్స్, రిలయన్స్ డిజిటల్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు విస్తరించనుంది. ఫిన్‌టెక్ పార్టనర్లలో రేజర్ పే, పేయూ, పైన్ ల్యాబ్స్ వంటి సంస్థలు కూడా ఈ విధానాన్ని అవలంభించనున్నాయి.

Read Also : Traffic Rules : డివైడర్‌పై యువకుడి బైక్ స్టంట్.. ‘డేర్ డెవిల్’కు సజ్జనర్ స్ట్రాంగ్ వార్నింగ్!

వీసా అభిప్రాయం ప్రకారం.. ఓటీపీలపై ఆధారపడటం వల్ల ఫిషింగ్, ఫేక్ కాల్స్, సోషల్ ఇంజనీరింగ్ వంటి మోసాలు పెరుగుతున్నాయి. పాస్‌కీలు అయితే వినియోగదారుడి డివైజ్‌లోనే సేఫ్ గా స్టోర్ అవుతాయి. సైబర్ మోసగాళ్లు ఈ పాస్ కీలను కాపీ చేయడం లేదా దొంగిలించడం చాలా కష్టం. వినియోగదారులకు ఫుల్ సేఫ్టీని అందిస్తుంది.

భారత్‌లో ఇప్పటికే కార్డ్ లావాదేవీలలో టోకనైజేషన్ పూర్తి స్థాయిలో అమలులో ఉంది. దాంతో పాటు పాస్‌కీ విధానం కూడా యాడ్ అవుతుంది. తద్వారా డిజిటల్ పేమెంట్లు మరింత వేగంగా, ఈజీగా మారుతాయని వీసా భావిస్తోంది.

ఓటీపీ కోసం ఇంకా వెయిట్ చేయాల్సిన పని ఉండదు. ఒక్క క్లిక్ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా పేమెంట్ పూర్తవుతుంది. మొత్తంగా, ఈ కొత్త వీసా సదుపాయం భారత డిజిటల్ పేమెంట్ సిస్టమ్ మరింత సురక్షితంగా, వేగంగా మార్చనుంది.