Traffic Rules : డివైడర్‌పై యువకుడి బైక్ స్టంట్.. ‘డేర్ డెవిల్’కు సజ్జనర్ స్ట్రాంగ్ వార్నింగ్!
Traffic Rules : డివైడర్ ర్యాంప్ కాదు.. హెల్మెట్ లేకుండా డివైడర్ మీద బైక్ రైడింగ్ చేయడం ప్రాణాల మీదకు వస్తుంది. ఇలా చేస్తే నేరుగా ఆస్పత్రికే అంటూ వీసీ సజ్జనర్ హెచ్చరించారు.
Traffic Rules Ignored: VC Sajjanar
- డివైడర్ ర్యాంప్ కాదు.. ప్రాణాలతో చెలగాటం వద్దు
- హెల్మెట్ లేదు.. హద్దులు లేవు.. డివైడర్‌పైనే బైక్
- కొన్ని నిమిషాల కోసం ప్రాణాలా? సజ్జనర్ ఫైర్
- డివైడర్‌పై బైక్ స్టంట్.. ‘నేరుగా ఆస్పత్రికే’ అంటూ హెచ్చరిక
Traffic Rules : ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాల్సిందే.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొంతమంది అదే పనిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉంటున్నాయి.
రోడ్డు భద్రతకు సంబంధించి పోలీసులు కూడా అవగాహన కల్పిస్తున్నా వినడం లేదు. మా తీరు మార్చుకోం (Traffic Rules) అన్నట్టుగా కొందరు ఆకతాయి వాహనదారులు ప్రవర్తిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా పట్టించుకోకుండా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు.
హెల్మెట్ లేదు, ట్రాఫిక్ నిబంధనలపై గౌరవం లేదు.. కేవలం డేర్ డెవిల్ విన్యాసాలు మాత్రమే!
డివైడర్లు రోడ్లను విభజించడానికి ఏర్పాటు చేసినవి, మీ ద్విచక్ర వాహనాలు ర్యాంప్ వాక్ చేయడానికి కాదు.
కొద్ది నిమిషాల సమయం ఆదా చేయడం కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి.
ఇలాంటి సాహసాలు మిమ్మల్ని… pic.twitter.com/ofRnr6Z3RV
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) July 2, 2026
ఈ నేపథ్యంలో డివైడర్‌పైనే బైక్ నడుపుతున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత :
‘హెల్మెట్ లేదు.. ట్రాఫిక్ నిబంధనలపై గౌరవం అంతకన్నా లేదు.. కేవలం డేర్ డెవిల్ విన్యాసాలు మాత్రమే.. డివైడర్లు రోడ్లను విభజించడానికి ఏర్పాటు చేశారు తప్ప టూవీలర్ ర్యాంప్ వాక్ చేసేందుకు కాదు. కొద్ది నిమిషాల సమయం ఆదా చేసేందుకు ఇలా ప్రాణాలను పణంగా పెట్టకండి. ఇలాంటి సాహసాలు మిమ్మల్ని గమ్యస్థానాలకు కాదు.. నేరుగా యమపురికో లేదా ఆస్పత్రి బెడ్కో చేరుస్తాయి. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటూ సజ్జనర్ పోస్టులో పేర్కొన్నారు.
పోలీసులు ఇలాంటి ఘటనలపై పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలని లేదా సరదా కోసం ఇలాంటి డేంజరస్ స్టంట్లకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతోపాటు రైడింగ్ సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, బాధ్యతాయుతంగా వాహనం నడపడం ద్వారా మాత్రమే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని పోలీసులు మరోసారి సూచిస్తున్నారు.
