Credit Card Rules : మీ చేతిలో క్రెడిట్ కార్డు ఉన్నా లాంగ్ టైమ్ వాడకపోతే ఏమౌతుంది? ఏమైనా ఛార్జీలు పడతాయా?
Credit Card Rules : ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు తీసుకుని ఏళ్ల తరబడి వాడకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఏమైనా ఛార్జీలు పడతాయా? క్రెడిట్ హిస్టరీ ఏమౌతుది? పూర్తి వివరాలేంటో చూద్దాం..
- Sreehari A
- Published on- September 6, 2026 / 12:40 PM IST
Credit Card Rules
- క్రెడిట్ కార్డు తీసుకుని పక్కన పెట్టేశారా? ముందుగా ఇది తెలుసుకోండి
- కార్డు వాడకపోయినా ఛార్జీలు? క్రెడిట్ కార్డు అసలు లెక్క ఇదే!
- క్రెడిట్ కార్డు వాడకుండా ఉంచడం మంచిదేనా? క్లోజ్ చేయాలా?
Credit Card Rules : మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి? అన్ని క్రెడిట్ కార్డులను వాడుతున్నారా? మీరు ఏదైనా క్రెడిట్ తీసుకుని అలానే వాడకుండా వదిలేశారా? అయితే ఇది మీకోసమే.. చాలామంది క్రెడిట్ కార్డు తీసుకుంటారు.. కానీ పెద్దగా వాడరు. అంటే అది ఇన్ యాక్టివ్ ఉంటుంది. క్రెడిట్ కార్డు ఏళ్ల తరబడి యాక్టివేట్ లేకుంటే ఏమౌతుంది? ఏమైనా ఛార్జీలు పడతాయా? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డు వాడకపోతే ఏమవుతుంది? :
ముందుగా, మీరు క్రెడిట్ కార్డును తీసుకున్నాక యాక్టివేట్ చేయకపోతే వాడలేరు. అంటే.. మీ క్రెడిట్ కార్డును వాడే (Credit Card Rules) ముందు తప్పనిసరిగా యాక్టివేట్ చేసి ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసే ముందు కార్డు జారీ చేసే కంపెనీలు కస్టమర్ సమ్మతిని పొందాలి.
ఒకవేళ కస్టమర్ యాక్టివేషన్‌కు అనుమతి నిరాకరిస్తే.. బ్యాంక్ లేదా కార్డ్ కంపెనీ ఎలాంటి ఛార్జీ లేకుండా క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్లోజ్ చేయాలి. కేవలం కార్డును అందించినంత మాత్రాన అది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయినట్లు కాదు.
వాడకపోయినా ఛార్జీలు పడతాయి :
మీ క్రెడిట్ కార్డును ఒకసారి యాక్టివేట్ చేశాక నెలల తరబడి వాడకపోయినా మీ ఖాతా ఇప్పటికీ యాక్టివ్ క్రెడిట్‌గానే పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డు నిబంధనలను బట్టి జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఫీజు అప్లయ్ అవుతుంది. క్రెడిట్ కార్డుతో ఎలాంటి కొనుగోళ్లు చేయకపోయినా అన్ని ఛార్జీలు మాఫీ కావు. అందుకే మీరు యాక్టివ్‌గా ఉన్న క్రెడిట్ కార్డును వాడినా వాడకపోయినా కొన్ని ఛార్జీలు తప్పక చెల్లించాలి.
కస్టమర్లకు క్లోజింగ్ అలర్ట్ :
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఒక ఏడాది కన్నా ఎక్కువ కాలం వాడకపోతే ఆ క్రెడిట్ కార్డును జారీ చేసిన బ్యాంకు లేదా కంపెనీ క్లోజింగ్ చేసే ప్రాసెస్ చేస్తాయి. దీనికి కార్డ్ హోల్డర్‌కు ముందుగా నోటీసు ఇస్తాయి. అప్పటికీ పట్టించుకోకుంటే మీ కార్డును క్లోజ్ చేస్తాయి.
మీ దగ్గర ఇన్ యాక్టివ్ క్రెడిట్ కార్డ్ ఉండి ఇకపై వాడొద్దని భావిస్తే ఆ విషయాన్ని ముందుగా బ్యాంకుకు చెప్పాలి. మీకు ఇకపై క్రెడిట్ కార్డ్ అవసరం లేదని అధికారిక క్లోజింగ్ ప్రాసెస్ పూర్తి చేయండి. ఇంకా కార్డును వాడుకోవాలని చూస్తే ఫీజులు, బిల్లింగ్ సైకిల్, పేమెంట్ రూల్స్ తప్పక తెలుసుకోండి.
