What makes the world’s billionaire rankings change so often ( Image Source : Google )
World Billionaire Rankings : ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంకులు తరచుగా మారుతుంటాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అపర కుబేరుడిగా అగ్రస్థానంలో నిలిచిన ఒక బిలియనీర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ర్యాంకును కోల్పోతుంటారు. ఒక మాటలో చెప్పాలంటే.. ఈ ర్యాంకులను ట్రాక్ చేయడమనేది ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిదే. ఎప్పుడు ఎవరికి ఎలా ఫలితం వస్తుందో చెప్పడం కష్టమే. అలాగే బిలియనీర్ల ర్యాంకులు కూడా అదే తరహాలో అంచనాలు మారిపోతుంటాయి.
మొన్నటివరకూ ఆసియాలోనే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ, తర్వాత ఊహించలేని విధంగా ఆయన ర్యాంకు ఒక్కసారిగా పడిపోయింది. ఆయన స్థానంలో అపర కుబేరుడు గౌతమ్ అదానీ అగ్రస్థానానికి ఎగబాకారు. అందుకు కారణం.. అదానీ నికర సంపద ఆకస్మిక పెరగడమే.. బిలియనీర్లు అత్యధిక సంపాదనతో ఆధిక్యాన్ని సంపాదించిన కొన్ని వారాల తర్వాత మార్కెట్ మార్పుల ద్వారా ర్యాంకింగ్స్‌లో హెచ్చుతగ్గుదల కనిపించవచ్చు. అయితే కొన్ని కీలక అంశాలను కూడా కారణాలను చెప్పవచ్చు.
Read Also : Nobel Prize 2024 : అర్థశాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్ పురస్కారం.. ఎవరెవరంటే?
స్టాక్ మార్కెట్ ఊపందుకోవడం :
బిలియనీర్ల సంపద తరచుగా వారి సొంత లేదా నియంత్రణలో ఉన్న కంపెనీలలోని షేర్ల విలువపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ స్టాక్ ధర పెరిగినప్పుడు, ఆయా కంపెనీ యజమాని నికర విలువ కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. ఉదాహరణకు.. టెక్ దిగ్గజం ఎలన్ మస్క్.. తన టెస్లా స్టాక్ ధరతో ఆయన సంపద పెరగొచ్చు లేదా తగ్గవచ్చు. టెస్లా భవిష్యత్తుపై పెట్టుబడిదారులు విశ్వసిస్తే.. మస్క్ సంపద పెరుగుతుంది. కానీ, విశ్వాసం తగ్గిపోతే ఆయన ట్విట్టర్ కొనుగోలు సమయంలో మాదిరిగా టాప్ ర్యాంకు నుంచి దిగువకు తగ్గిపోతుంది.
ఆర్థిక సంఘటనలు, సంక్షోభాలు :
ఆర్థిక మాంద్యం, మహమ్మారి, భౌగోళిక రాజకీయ సంఘటనలు కూడా బిలియనీర్ల ర్యాంకులపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు.. 2020లో జెఫ్ బెజోస్ సొంత అమెజాన్ ప్లాట్‌ఫారంపై గ్రాసరీల నుంచి అన్ని గాడ్జెట్లను వినియోగదారులు ఎగబడి కొనేశారు. దాంతో అమెజాన్ సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడినప్పుడు కూడా అమెజాన్ స్టాక్ నెమ్మదిగా వృద్ధిని సాధించింది. బెజోస్‌ను జాబితాలో కొద్దిగా మాత్రమే ప్రభావాన్ని చూపింది. అదేవిధంగా, ఆర్నాల్ట్ లగ్జరీ బ్రాండ్‌లు ఆర్థిక వృద్ధి సమయంలో వృద్ధి చెందాయి. అయితే, మార్కెట్లు తిరోగమనాలను ఎదుర్కొన్నప్పుడు మాత్రం ఒక్కసారిగా పతనమయ్యాయి.
పెట్టుబడి, వ్యాపార వెంచర్లు :
బిలియనీర్లు తరచుగా టెక్, రిటైల్ నుంచి హెల్త్‌కేర్, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ వరకు అన్నింట్లో తమ షేర్లను కలిగి ఉంటారు. ఈ వెంచర్‌లలో ఏదైనా ఒకటి లాభాలు సాధిస్తే ర్యాంకుల జాబితాను కూడా పెంచుతుంది. ఉదాహరణకు.. లారీ ఎల్లిసన్ ఒరాకిల్, టెస్లా రెండింటిలోనూ గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒరాకిల్ షేర్లు పెరిగినప్పుడు, ఆయన నికర విలువ కూడా పెరిగింది. మరోవైపు, రిస్క్‌తో కూడిన కొత్త వెంచర్‌లలో పెట్టుబడులు బిలియనీర్ నికర విలువను కూడా తగ్గించవచ్చు.
విరాళాలతో కూడా ర్యాంకింగ్స్ పెరగొచ్చు :
విరాళాలుగా (దాతృత్వం) ఇవ్వడం సంపద ర్యాంకింగ్స్‌ను మార్చవచ్చు. వారెన్ బఫెట్‌తో సహా చాలా మంది బిలియనీర్లు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇస్తుంటారు. బఫ్ఫెట్ విషయంలో తన సంపదలో 99శాతం విరాళంగా ఇచ్చారు. అంటే.. ప్రతి విరాళం ఆయన నికర విలువను మరింత పెంచుతుంది. ఈ భారీ విరాళాలు ఉన్నప్పటికీ, వ్యూహాత్మక పెట్టుబడులు ఆయన సంపదను దృఢంగా ఉంచాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలబెట్టాయి.
కరెన్సీ హెచ్చుతగ్గులు :
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లపై కరెన్సీ విలువ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు.. భారత రూపాయి బలహీనపడినప్పుడు అమెరికన్ బిలియనీర్ల ఆస్తులతో పోలిస్తే.. భారతీయ బిలియనీర్ ఆస్తుల డాలర్ విలువ తక్కువగా కనిపించవచ్చు. ఈ అంశం ముఖ్యంగా ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్లను ప్రభావితం చేస్తుంది. వీరి సంపద ఎక్కువగా విలువ కలిగిన ఆస్తులపై ఆధారపడి ఉంటుంది.
విలీనాలు, సముపార్జనల ప్రభావం :
బిలియనీర్లు తమ కంపెనీల్లో ఎక్కువ షేర్లను కొనుగోలు చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు లేదా విలీనం చేసినప్పుడు వారి సంపద ఒక్కసారిగా పెరగవచ్చు లేదా క్షీణించవచ్చు. ఉదాహరణకు.. అంబానీ గ్రీన్ ఎనర్జీ, రిటైల్ వంటి కొత్త రంగాలలోకి ప్రవేశించడం ద్వారా ఆయన నికర సంపాదన ఒక్కసారిగి పెరిగింది. బ్లూ ఆరిజిన్ వంటి వెంచర్ల నిధులకు బెజోస్ బిలియన్ డాలర్ల విలువైన అమెజాన్ షేర్లను విక్రయించారు. దాంతో ఆయన సంపదలో హెచ్చుతగ్గులకు దారితీసింది.
ప్రతి డీల్ బిలియనీర్ నికర విలువను గణనీయంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బిలియనీర్లు నికర సంపాదన ఆధారంగా వారి సంపన్నుల జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయి. విరాళాలు కావొచ్చు లేదా రోజువారీ మార్కెట్ హెచ్చు తగ్గులు కావొచ్చు.. వీటి కారణంగా సంపన్నుల జాబితా మారుతూ ఉంటుంది.