Vivo-iQOO Prices Hike : కొత్త ఫోన్ కొనాలా వద్దా? వివో, ఐక్యూ ఫోన్లు చాలా కాస్ట్‌లీ గురూ.. కొత్త ధరలు చూస్తే షాకవుతారు!
Vivo-iQOO Prices Hike : మెమరీ చిప్‌ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలే కాదు.. కొనుగోలుదారులపై కూడా ప్రభావం చూపుతోంది. వివో, ఐక్యూ కంపెనీలు భారత మార్కెట్లో అనేక స్మార్ట్ఫోన్ల ధరలను భారీగా పెంచేశాయి..
- Sreehari A
- Published on- June 13, 2026 / 04:57 PM IST
Vivo-iQOO Prices Hike
- మెమెరీ చిప్ కొరత కారణంగానే వివో, ఐక్యూ ఫోన్ల ధరల పెంపు
- భారత మార్కెట్లో కొత్త ఫోన్ల ధరలు ఇప్పుడు చాలా ఖరీదు
- ఏకంగా రూ. 3వేలు పెరిగిన వివో టీ5 ప్రో, ఐక్యూ 15 లైనప్ ధరలు
Vivo-iQOO Prices Hike : వివో, ఐక్యూ లవర్స్ కు బిగ్ షాకింగ్ న్యూస్.. భారత మార్కెట్లో ఈ రెండు బ్రాండ్ల ఫోన్లను కొనడం కష్టమే.. మెమరీ చిప్‌ల కొరత కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొబైల్ కంపెనీలు ఖర్చుల భారాన్ని ఇప్పుడు కొనుగోలుదారులపై మోపుతున్నాయి.
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన వివో, ఐక్యూ భారత మార్కెట్లో అనేక స్మార్ట్ఫోన్ల ధరలను భారీగా పెంచేశాయి. పాపులర్ ఫోన్లలో కొన్ని కేవలం (Vivo-iQOO Prices Hike) ఖరీదైనవిగా మారాయి. ఈ ధరల పెంపుతో ఫ్లాగ్‌షిప్, ప్రీమియం మిడ్-రేంజ్, పర్ఫార్మెన్స్‌పై ఎఫెక్ట్ పడింది. ఇంతకీ ఏయే ఫోన్ల ధరలు పెరిగాయో వివరంగా తెలుసకుందాం..
వివో, ఐక్యూ ఫోన్ల ధరల పెంపు :
ఇప్పటివరకూ పెరిగిన అన్ని ఫోన్లలో వివో T5 ప్రో ధర అత్యధికంగా పెరిగింది. 8GB + 128GB వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ. 29,999 ఉండగా ఇప్పుడు రూ. 32,999కి పెరిగింది. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 33,999 నుంచి రూ.36,999కి పెరిగింది. ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 3వేల వరకు పెరిగాయి.
ఐక్యూ విషయానికి వస్తే.. ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్-సెంట్రలైజడ్ లైనప్ ధరలను కూడా సవరించింది. ఐక్యూ 15 (12GB + 256GB) ధర గతంలో రూ. 72,999 ధర నుంచి ఇప్పుడు రూ. 74,999కి పెరిగింది. 12GB + 512GB వేరియంట్ ధర రూ. 79,999 నుంచి రూ.81,999కి పెరిగింది.
అదనంగా, ఐక్యూ 15R లైనప్ ధర కూడా పెరిగింది. 8GB + 128GB మోడల్ ధర రూ. 46,999 నుంచి ఇప్పుడు రూ. 47,999కి తగ్గింది. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 50,999 నుంచి రూ. 52,999కి పెరిగింది. టాప్-ఎండ్ 12GB + 512GB వేరియంట్ ధర రూ. 57,999 నుంచి రూ. 59,999కి పెరిగింది.
ఐక్యూ నియో 10 ధర రూ. 2వేలు పెరిగింది. 8GB + 256GB మోడల్ ధర ఇప్పుడు రూ. 37,999 కాగా, 12GB + 256GB వెర్షన్ ధర రూ. 42,999గా ఉంది. గతంలో ఈ రెండు వేరియంట్లు వరుసగా రూ. 35,999, రూ. 40,999 ధరలకు కొనేసుకోవచ్చు. కొత్త ధరలను బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రధాన ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లలో చెక్ చేసుకోవచ్చు.
మెమరీ కొరత ప్రభావమే కారణం :
ఇటీవలి స్మార్ట్ ఫోన్ల ధరల పెంపునకు ప్రపంచవ్యాప్త మెమరీ చిప్‌ల కొరతే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్‌లకు అవసరమైన ముఖ్యమైన స్పేర్ పార్టుల ధరలు భారీగా పెరిగాయి. మెమరీ ధరలు పెంపుతో చివరికి స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత పెరగొచ్చునని ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ కొన్ని నెలలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే అంచనా నిజమవుతున్నట్లు కనిపిస్తోంది.
గత ఏడాది చివర్లో లాంచ్ కాగా ఐక్యూ 15 ధర పెరగడం ఇదే ఫస్ట్ టైమ్.. పెరుగుతున్న ప్రొడక్టుల వ్యయాలకు అనుగుణంగా బ్రాండ్‌లు ధరలను సర్దుబాటు చేస్తున్నా తక్కువ ధరకు లాంచ్ అయిన ఫోన్లు కూడా ఇప్పుడు ఖరీదైనవిగా మారుతున్నాయి.
