Realme Narzo Days Sale : రియల్‌మి ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఈ తేదీలోగా కొనేవారికి రూ. 16వేలు తగ్గింపు.. డోంట్ మిస్!
Realme Narzo Days Sale : రియల్‌మి ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. నార్జో డేస్ సేల్స్ సందర్భంగా ఈ రియల్ మి 5జీ ఫోన్లపై ఏకంగా రూ. 16వేల వరకు తగ్గింపు పొందవచ్చు. జూన్ 16లోగా మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.
Realme Narzo Days Sale
- రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్
- అమెజాన్‌లో జూన్ 16 వరకు రియల్‌మి నార్జో డేస్ సేల్ ఆఫర్లు
- ఈ రియల్‌మి ఫోన్లపై రూ. 16వేల వరకు తగ్గింపు
Realme Narzo Days Sale : రియల్‌మి ఫ్యాన్స్ కోసం అద్భుతమైన సేల్ ఆఫర్లు.. రియల్‌మి లేటెస్ట్ ‘రియల్‌మి నార్జో డేస్’ సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా వివిధ ఫోన్లపై నేరుగా డిస్కౌంట్లను అందిస్తోంది. రియల్‌మి నార్జో 80, నార్జో 90, నార్జో 100 లైనప్‌లకు చెందిన ఫోన్లు అతి చౌకైన ధరలకే లభిస్తున్నాయి.
నార్జో ఫోన్లలో అతిపెద్ద బ్యాటరీతో వచ్చిన రియల్‌మి నార్జో పవర్ 5జీ ఫోన్ కూడా డిస్కౌంట్ (Realme Narzo Days Sale) ధరకే లభిస్తోంది. ప్రస్తుతానికి రియల్‌మి నార్జో ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, కార్డ్ డిస్కౌంట్లు లిమిటెడ్ టైమ్ మాత్రమే. అమెజాన్ ద్వారా ఎంపిక చేసిన నార్జో ఫోన్లలో ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లపై మాత్రమే రియల్‌మి నార్జో డేస్ సేల్ వర్తిస్తుంది.
జూన్ 16 వరకే సేల్ ఆఫర్లు :
కొత్త రియల్‌మి నార్జో డేస్ సేల్ జూన్ 16న ముగియనుంది. ఈ డీల్స్ కేవలం అమెజాన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన రియల్‌మి నార్జో 100 లైట్ 5Gతో సహా 5 రియల్మీ నార్జో సిరీస్ ఫోన్లు ప్రస్తుతం తక్కువ ధరలకే లభిస్తున్నాయి. బేస్ మోడల్ 4GB + 128G ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999 కాగా, ఈ ఫోన్ ఇప్పుడు తగ్గింపు ధర రూ. 15,249కి లభిస్తోంది.
7,000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. అతిపెద్ద 10,001mAh బ్యాటరీతో రియల్‌మి నార్జో పవర్ 5జీ ఫోన్ అసలు ధర రూ. 35,999 నుంచి రూ. 27,999కి తగ్గింది. ఈ ఫోన్ ఏకంగా రూ. 8వేలు తగ్గింది. మరోవైపు, రియల్‌మి నార్జో 90x 5జీ ఫోన్ కూడా రూ. 16వేలు తగ్గింపుతో లభిస్తోంది.
ఈ రియల్‌మి ఫోన్ అసలు ధర రూ. 33,999 ఉండగా ఇప్పుడు రూ. 17,999 తగ్గింపు ధరకు లభిస్తోంది. రియల్‌మి నార్జో 80 సిరీస్‌లో రెండు ఫోన్ల ధరలు కూడా భారీగా తగ్గాయి. రియల్‌మి నార్జో 80 లైట్, రియల్మీ నార్జో 80 ప్రో 5జీ ఫోన్ల ధరలు వరుసగా రూ. 11,499, రూ. 23,999 తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రియల్‌మి నార్జో డేస్ సేల్ జూన్ 16న ముగియనుంది. ఈలోపే మీక నచ్చిన ఫోన్ ఆర్డర్ పెట్టుకోవడం బెటర్. ఏ రియల్మీ నార్జో సిరీస్ ఫోన్ కావాలో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఈ సేల్ సమయంలో అమెజాన్‌లో అదనపు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉండవు.
