Samsung One UI 9 Update : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. వన్ UI 9 రిలీజ్! ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? ఇప్పుడే అప్డేట్ చేసుకోండి!
Samsung One UI 9 Update : శాంసంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త వన్ యూఐ 9 బీటా వచ్చేసింది. ఈ కొత్త బీటా వెర్షన్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Samsung One UI 9 Update
- శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ యూజర్ల కోసం కొత్త వన్ UI 9 బీటా
- కస్టమైజడ్, సేఫ్టీ ఫీచర్లు, పర్సలైజడ్ నోట్స్ క్రియేట్ చేయొచ్చు
- శాంసంగ్ మెంబర్స్ యాప్ ద్వారా బీటాలో జాయిన్ అవ్వొచ్చు
- ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ కొత్త అప్డేట్ డౌన్లోడ్
Samsung One UI 9 Update : శాంసంగ్ లవర్స్ కోసం బిగ్ అప్డేట్.. శాంసంగ్ అధికారికంగా వన్ యూఐ 9 బీటా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫుల్ అప్డేట్ ఇంకా రిలీజ్ కాలేదు. అంతకన్నా ముందే శాంసంగ్ గెలాక్సీ S26 యూజర్లు రాబోయే ఆండ్రాయిడ్ 17 ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను యాక్సస్ చేయొచ్చు. ఈ కొత్త అప్డేట్ పర్సనలైజేషన్ ఆప్షన్లు, మెరుగైన యాక్సెసిబిలిటీ ఫీచర్లు, సేఫ్టీ, శాంసంగ్ యాప్‌లలో కొత్త క్రియేటివ్ టూల్స్‌ను అందిస్తుంది.
ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ భారత్, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్తో సహా ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. కోర్ యాప్‌లు, సిస్టమ్ కంట్రోల్స్‌లో మార్పులతో పాటు శాంసంగ్ గుడ్ లాక్ ప్లాట్‌ఫామ్ ద్వారా నేటివ్ ఇంటర్నెట్ స్పీడ్ ఇండికేటర్‌ను కూడా తీసుకొచ్చింది. కంపెనీ ఇప్పటికే అనేక ఇతర గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, ఫోల్డబుల్ డివైజ్‌లలో వన్ యూఐ 9ని టెస్టింగ్ చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
వన్ యూఐ 9 ఫీచర్లు :
ప్రస్తుతం బీటా వెర్షన్లో వన్ యూఐ 9 ఉండగా, శాంసంగ్ ఇంటర్నల్ అప్లికేషన్లకు కూడా అప్డేట్ అందుకుంది. శాంసంగ్ నోట్స్‌లో ఇప్పుడు డెకరేటెడ్ టేప్ ఎఫెక్ట్లు, అదనపు పెన్ లైన్ స్టైల్స్‌తో వస్తుంది.
తద్వారా యూజర్లు మరింత పర్సనలైజడ్ నోట్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. కాంటాక్ట్స్ యాప్ కూడా క్రియేటివ్ స్టూడియోకి డైరెక్ట్ యాక్సెస్ అందిస్తుంది. తద్వారా యూజర్లు యాప్‌ల మధ్య మారకుండానే కస్టమ్ ప్రొఫైల్ కార్డ్‌లను డిజైన్ చేసుకోవచ్చు.
Read Also : Google Pixel 10 : సూపర్ డిస్కౌంట్ మావా.. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇంతకీ కొనాలా? వద్దా?
శాంసంగ్ యూజర్లు ఇప్పుడు బ్రైట్నెస్, సౌండ్ మీడియా కంట్రోల్స్‌ను స్వతంత్రంగా అడ్జెస్ట్ చేసేలా శాంసంగ్ క్విక్ ప్యానెల్‌లోని కొన్ని పార్టులను కూడా రీడిజైన్ చేసింది. ఇంకా కస్టమైజ్ చేసేందుకు ఈ ప్యానెల్ సైజు లేఅవుట్ ఆప్షన్లను మరెన్నో అందిస్తుంది. స్మూత్ కర్సర్ కంట్రోలింగ్ కోసం వన్ యూఐ 9కి మౌస్ కీ స్పీడ్ సెట్టింగ్స్ అందిస్తోంది.
కొత్త టెక్స్ట్ స్పాట్లైట్ ఫీచర్ ఎంచుకున్న టెక్స్ట్‌ను పెద్దగా, స్పష్టంగా ఫ్లోటింగ్ విండోలో డిస్ ప్లే చేస్తుంది. యూజర్లు చదివేందుకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ హై రిస్క్ యాప్‌లను వెంటనే గుర్తించగలదు. ముందుగానే యూజర్లను హెచ్చరిస్తుంది. అంటే అలాంటి యాప్స్ ఇన్స్టాలేషన్ చేయలేరు. ఒకవేళ ఫోన్లలో ఉంటే వెంటనే డిలీట్ చేయమని యూజర్లను హెచ్చరిస్తుంది.
వన్ యూఐ 9 లభ్యత :
ప్రస్తుతం వన్ యూఐ 9 బీటా ప్రోగ్రామ్ కేవలం గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రాకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, శాంసంగ్ త్వరలో ఈ బీటా ప్రోగ్రామ్‌ను గెలాక్సీ S25 సిరీస్, గెలాక్సీ A57, గెలాక్సీ A34, గెలాక్సీ A17 5G, గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫోల్డ్ 8, గెలాక్సీ Z ఫ్లిప్ 8, గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రాతో సహా ఇతర ఫోన్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది.
భారత్, దక్షిణ కొరియా, జర్మనీ, పోలాండ్, యూకే, యూఎస్‌లలోని శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ యూజర్లు ప్రస్తుతం వన్ యూఐ 9 బీటాను డౌన్లోడ్ చేసుకోవచ్చునని శాంసంగ్ అధికారికంగా ధృవీకరించింది. అయితే, ఈ బీటా మరిన్ని గెలాక్సీ డివైజ్‌లకు ఎప్పుడు విస్తరిస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
వన్ యూఐ 9 బీటా ఎలా పొందాలి? :
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ యూజర్లు ఇకపై శాంసంగ్ మెంబర్స్ యాప్ ద్వారా బీటా ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వొచ్చు. యాప్‌ను ఓపెన్ చేశాక వన్ యూఐ 9 బీటా ప్రోగ్రామ్ బ్యానర్ కోసం సెర్చ్ చేయండి. ఆపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. అప్రూవల్ తర్వాత బీటా అప్డేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings > Software Update > Download ఆప్షన్ ద్వారా ఇన్స్టాల్ చేయాలి.
