×
Ad

Xiaomi 15 Price : కొత్త షావోమీ 15 ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌‌లో ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

Xiaomi 15 Price : షావోమీ 15 ఫోన్ ఆఫర్ అదిరింది. ఫ్లిప్‌కార్ట్‌‌లో షావోమీ 15 అత్యంత చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Xiaomi 15 Price

Xiaomi 15 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు షావోమీ 15 ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఫ్లిప్‌కార్ట్‌‌లో ఈ షావోమీ ఫోన్ ధర రూ.79,999 నుంచి రూ.69,999కి తగ్గింది. ఎలాంటి బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు లేకుండా కొనేసుకోవచ్చు.

ఆసక్తిగల కస్టమర్లు తమ సేవింగ్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ, యాక్సస్ బ్యాంక్, ఇతర కంపెనీల (Xiaomi 15 Price) క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు. 70వేల కన్నా తక్కువ ధరకు లభించే అత్యంత ఆకర్షణీయమైన ఆప్షన్లలో ఇదొకటి. ఈ షావోమీ ఫోన్ టాప్-ఎండ్ స్పెషిఫికేషన్లు, ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుంది. ఈ షావోమీ 15 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

షావోమీ 15 డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో షావోమీ 15 ఫోన్ అసలు ధర రూ. 69,999 ఉండగా రూ. 10వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫ్లిప్‌కార్ట్ రూ. 4వేల వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్కువ ధరకు షావోమీ 15 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్..

Read Also : Motorola G67 Power 5G : ఇది కదా ఫోన్ అంటే.. మోటోరోలా G67 పవర్ 5G ఫోన్ ఆగయా.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

షావోమీ 15 స్పెసిఫికేషన్లు :
షావోమీ 15 అద్భుతమైన 6.36-అంగుళాల, 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. ఈ షావోమీ ఫోన్ కంటెంట్‌ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. HDR10+, డాల్బీ విజన్ సపోర్టుతో వస్తుంది.

హుడ్ కింద, ఈ షావోమీ ఫోన్ అత్యాధునిక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఆప్టిమైజ్ ఆండ్రాయిడ్-ఆధారిత హైపర్‌OS 2.0పై రన్ అవుతుంది. ఈ పర్ఫార్మెన్స్ కోసం భారీ 5,240mAh బ్యాటరీ కలిగి ఉంది. 90W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా స్పీడ్ రీప్లెనెన్‌షిప్‌కు సపోర్టు ఇస్తుంది.

ఫొటోగ్రఫీ ప్రియులు మల్టీఫేస్ ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో మెయిన్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లు ఉంటాయి. క్లియర్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తాయి. ప్రీమియం ప్యాకేజీ కోసం IP68 రేటింగ్, సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ షావోమీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ టాప్ రేంజ్ స్పెసిఫికేషన్‌లతో మరింత ఆకట్టుకునేలా ఉంది.