Motorola G67 Power 5G : ఇది కదా ఫోన్ అంటే.. మోటోరోలా G67 పవర్ 5G ఫోన్ ఆగయా.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Motorola G67 Power 5G : భారత మార్కెట్లో మోటోరోలా జీ67 5జీ ఫోన్ లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌తో అదిరిపోయే ఫీచర్లు కలిగి ఉంది. ధర ఎంతంటే?
Motorola G67 Power 5G
Motorola G67 Power 5G : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేసింది. మోటోరోలా కొత్త G సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. మోటో G67 పవర్ 5G పేరుతో మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ మోటోరోలా ఫోన్ భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ప్రీమియం వీగన్ లెదర్ ఫినిష్‌తో అందిస్తుంది. ధర దాదాపు రూ. 15,999కు పొందవచ్చు.
ఈ మోటోరోలా ఫోన్ నవంబర్ 12 నుంచి (Motorola G67 Power 5G) ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. మోటోరోలా G67 పవర్ 5G ధర, స్పెసిఫికేషన్లు, డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా G67 పవర్ 5G స్పెసిఫికేషన్లు :
మోటోరోలా G67 పవర్ 5G ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ మోటోరోలా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ మోటోరోలా జీ67 ఫోన్ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ మోటోరోలా ఫోన్ MIL-STD-810H స్టాండర్డ్స్ కలిగి ఉంది. డస్ట్, స్ప్లాష్‌ల నుంచి ప్రొటెక్షన్ కోసం IP64 రేటింగ్ కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు ఆండ్రాయిడ్ 16ను పొందుతుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP సోనీ LYT-600 మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, కర్వ లైన్ కోసం ఫ్లికర్ సెన్సార్‌ను అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
మోటోరోలా G67 పవర్ 5G భారత్ ధర, లాంచ్ ఆఫర్లు :
మోటో G67 పవర్ 5జీ ఫోన్ (8GB + 128GB) మోడల్ ధర రూ.15,999కు లభిస్తుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా కొనుగోలుదారులు ఎస్బీఐ లేదా యాక్సస్ బ్యాంక్ కార్డులతో రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. లేదంటే ఎక్స్ఛేంజ్‌లో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. మోటో G67 పవర్ 5G ఫోన్ సిలియెంట్రో, కురాకో బ్లూ, పారాచూట్ పర్పుల్ వంటి పాంటోన్-క్యూరేటెడ్ కలర్ ఆప్షన్లలో లభ్యవుతుంది. ప్రతి కలర్ ఆప్షన్ సాఫ్ట్-టచ్ వీగన్ లెదర్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది.
