Xiaomi AC Launch : కొత్త షావోమీ AC వచ్చేసింది.. జస్ట్ 3 నిమిషాల్లో ఇల్లంతా కూల్.. సూపర్ పవర్ సేవింగ్.. మీ బడ్జెట్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్!

Xiaomi AC Launch : షావోమీ నుంచి సూపర్ పవర్ సేవింగ్ ఏసీ లాంచ్ అయింది. కేవలం 3 నిమిషాల్లో మీ ఇంటిని కూలింగ్ చేస్తుంది. మీ బడ్జెట్ ధరలో ఈజీగా కొనేసుకోవచ్చు.

Xiaomi AC Launch

Xiaomi AC Launch : కొత్త ఏసీ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన ఏసీ వచ్చేసింది. షావోమీ మార్కెట్లో సరికొత్త ఏసీని లాంచ్ చేసింది. కంపెనీ మిజియా ఎయిర్ కండిషనర్ జెయింట్ పవర్ సేవర్ 2026 మోడల్ కాగా.. జస్ట్ 3 నిమిషాల్లో ఫాస్ట్ కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఏసీ స్పెషాలిటీ ఏంటంటే.. మీరు ఎంత వాడినా పవర్ ఆదా చేస్తుంది.

ప్రతి ఏడాదిలో 208kWh పవర్ ఆదా చేయగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఏసీలో 9.8cc కంప్రెసర్ అమర్చారు. డ్యూయల్-రో ఎవాపరేటర్ ఉంది. 108mm క్రాస్ ఫ్లో ఫ్యాన్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం.. గంటకు 760 క్యూబిక్ మీటర్ల ఎయిర్ అందించగలదు. ఈ ఏసీ ధర, ఇతర ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మిజియా ఏసీ జెయింట్ పవర్ సేవర్ ధర ఎంతంటే? :
మిజియా ఎయిర్ కండిషనర్ జెయింట్ పవర్ సేవర్ 2026 ధర 1,899 యువాన్లు (సుమారుగా రూ. 26,800). కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. ఈ ఏసీని (JD.com) నుంచి కొనుగోలు చేయవచ్చు. అమ్మకాలు మే 30న ప్రారంభమవుతాయి. కంపెనీ ప్రస్తుతం ఈ ఏసీని చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

మిజియా ఏసీ జెయింట్ పవర్ సేవర్ ఫీచర్లు :
మిజియా ఎయిర్ కండిషనర్ జెయింట్ పవర్ సేవర్ 2026 ప్రత్యేకత పవర్ ఆదా చేయడమే.. ప్రతి ఏడాదిలో 208kWh విద్యుత్‌ను ఆదా చేయగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఏసీలో 9.8cc కంప్రెసర్ అమర్చారు. దీనికి డ్యూయల్-రో ఎవాపరేటర్ ఉంది.

Read Also : New Bike Guide : కొత్త బైక్ కొన్నారా? ఫస్ట్ 1000 కి.మీ లోపు ఈ తప్పు చేస్తే.. ఇంజిన్ గేమ్ ఓవర్!

108mm క్రాస్ ఫ్లో ఫ్యాన్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం.. గంటకు 760 క్యూబిక్ మీటర్ల ఎయిర్ ఫ్లో అందించగలదు. అదే సమయంలో ఒక సాధారణ గదిలో కేవలం 3 నిమిషాల్లోనే కావాలసిన టెంపరేచర్ చేరుకోగలదు. ఇందులో ఫాస్ట్ కూలింగ్ ఫీచర్ ఉంది.

యూజర్లకు తగినట్టుగా మార్చుకోవచ్చు :
ఈ కొత్త ఏసీ, కంపెనీ మిజియా లింగ్యున్ కంట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కూలింగ్ సెట్ మార్చుకోవచ్చు. ఉదాహరణకు.. యూజర్లు నిద్రపోతున్నప్పుడు పవర్ సేవింగ్ చేస్తుంది. రూమ్ టెంపరేచర్ కూడా సౌకర్యవంతంగా ఉంచుతుంది.

ఈ ఏసీ ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇంటర్నల్ డయాగ్నస్టిక్ సిస్టమ్ ఉంది. మెయింటైనెన్స్ కోసం యాప్ ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్‌ పంపుతుంది. దీనికి సెల్ఫ్-క్లీనింగ్ ఫంక్షన్ కూడా ఉంది. చాలా తక్కువ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ 18dB అంత తక్కువగా ఉంటుంది.