Xiaomi AI AC : షావోమీ కొత్త AI ఏసీ భలే ఉందిగా.. జస్ట్ 15 సెకన్లలో మీ ఇల్లంతా కూల్ కూల్.. ధర ఎంతో తెలుసా?

Xiaomi AI AC : షావోమీ నుంచి కొత్త ఏఐ ఏసీ లాంచ్ అయింది. మిజియా ఏసీ పవర్ ఫుల్ విండ్ ప్రో పేరుతో స్ల్పిట్ ఏసీ మార్కెట్లోకి వచ్చింది. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఇల్లు మొత్తం కూలింగ్ చేయగలదు.. ధర ఎంతంటే?

Xiaomi AI AC ( Image Credit : AI )

  • మిజియా ఏసీ పవర్‌ఫుల్ విండ్ ప్రో వచ్చేసింది
  • రెండు వరుసల క్లీన్ కాపర్ కండెన్సర్, ఎవాపరేటర్‌
  • 15 సెకన్లలో గదిని కూలింగ్ చేయగలదు
  • 118mm క్రాస్ ఫ్లో ఫ్యాన్, 500W కూలింగ్ కెపాసిటీ

Xiaomi AI AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? షావోమీ నుంచి సరికొత్త ఏఐ ఏసీ వచ్చేసింది. మిజియా ఏసీ పవర్‌ఫుల్ విండ్ ప్రో పేరుతో స్ప్లిట్ ఏసీ మోడల్ లాంచ్ అయింది. ఈ ఏసీ బేస్ మోడల్‌ను కంపెనీ గత నెలలోనే ఆవిష్కరించింది.

ఇప్పుడు, కొత్త మోడల్ అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లతో వస్తుంది. 1.5HP వాల్-మౌంటెడ్ (Xiaomi AI AC) ఏసీలో 13cc డ్యూయల్-సిలిండర్ కంప్రెసర్ ఉంది. డ్యూయల్-రో క్లీన్ కాపర్ కండెన్సర్, ఎవాపరేటర్‌తో అమర్చారు. ఈ ఏఐ ఏసీ 6500W కూలింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. 8800W వరకు వేడి చేయగలదు. ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

మిజియా ఏసీ పవర్‌ఫుల్ విండ్ ప్రో ధర :
మిజియా ఎయిర్ కండిషనర్ పవర్‌ఫుల్ విండ్ ప్రో చైనాలో లాంచ్ అయింది. షావోమీ మాల్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఎయిర్ కండిషనర్ ధర 3,299 యువాన్లు (సుమారు రూ. 46,500) ఉంటుంది.

Read Also : Jio Rechage Plan : జియో యూజర్లకు పండగే.. 912GB ఫ్రీ డేటా, 5G అన్‌లిమిటెడ్ కాలింగ్.. 365 రోజులు జెమిని ప్రో ఏఐ ఫ్రీ..

మిజియా ఏసీ పవర్‌ఫుల్ విండ్ ప్రో ఫీచర్లు :
మిజియా ఎయిర్ కండిషనర్ పవర్‌ఫుల్ విండ్ ప్రో అనేక అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది. 13cc డ్యూయల్-సిలిండర్ కంప్రెసర్‌తో 1.5HP వాల్-మౌంటెడ్ ఏసీని అందిస్తుంది. ఇందులో డ్యూయల్-రో క్లీన్ కాపర్ కండెన్సర్, ఎవాపరేటర్ అమర్చి ఉన్నాయి. 6500W కూలింగ్ సామర్థ్యం, 8800W హీటింగ్ సామర్థ్యం లభిస్తుంది. 15 సెకన్లలో కూలింగ్ అవుతుంది. 30 సెకన్లలో వేడి గాలిని బయటకు పంపగలదని కంపెనీ పేర్కొంది.

కంపెనీ థర్మల్ ఎక్స్ఛేంజ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కండెన్సర్ ఏరియాను డబుల్ చేసింది. అధిక హీటింగ్ ఎక్స్చేంజ్ అవుతుంది. రిఫ్రిజెరెంట్ కంట్రోల్ సిస్టమ్ కారణంగా కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలదు. -20°C నుంచి 55°C వరకు ఉష్ణోగ్రతలలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 118mm క్రాస్-ఫ్లో ఫ్యాన్ ఉంది. గంటకు 1000 క్యూబిక్ మీటర్ల ఎయిర్ బయటకు పంపగలదు.

కూలింగ్ సమయంలో చల్లని గాలిని పైకప్పు వైపుకు పంపి గాలి నెమ్మదిగా కిందికి దిగుతుంది. అయితే, వేడి గాలిని పంపేటప్పుడు అది గాలిని నేరుగా నేల వైపుకు పంపుతుంది. షియోమీ స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌తో కనెక్ట్ అవుతుంది.

హైపర్‌ఓఎస్ (HyperOS)పై రన్ అవుతుంది. ఇందులో ఏఐ (AI) మాడ్యూల్ ఉంది. షావోమీఏఐ (XiaoAI) వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. కంపెనీ సెల్ఫ్-క్లీనింగ్ ఫీచర్‌ కూడా అమర్చింది. చైల్డ్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.