Xiaomi Watch S5 : ఫిట్‌నెస్ లవర్స్‌కి పర్ఫెక్ట్ గాడ్జెట్.. 21 రోజుల బ్యాటరీతో షావోమీ వాచ్ S5.. హార్ట్‌రేట్ నుంచి SpO2 వరకు అన్నీ ట్రాక్..!
Xiaomi Watch S5 : షావోమీ వాచ్ S5 వచ్చేసింది. 1.48-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 21 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. హెల్త్ ఫీచర్లతో మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ ట్రాక్ చేయొచ్చు.
- Sreehari A
- Published On : March 20, 2026 / 12:19 PM IST
Xiaomi Watch S5
- షావోమీ కొత్త స్మార్ట్‌వాచ్ S5 చైనా మార్కెట్లో లాంచ్
- 1.48 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 21 రోజుల బ్యాటరీ లైఫ్
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు కూడా సపోర్టు
- మరెన్నో హెల్త్ మానిటర్, ఫిట్ నెస్ ట్రాకింగ్ ఫీచర్లు
Xiaomi Watch S5 : కొత్త స్మార్ట్ వాచ్ కొందామని అనుకుంటున్నారా? షావోమీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు స్మార్ట్‌వాచ్ లైనప్‌లో సరికొత్త షియోమీ వాచ్ S5 చైనాలో లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశంలో కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కొత్త వేరబుల్ మొత్తం 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
షావోమీ వాచ్ S5 సెల్యులార్, బ్లూటూత్ + సెల్యులార్ మోడళ్లలో కూడా అందుబాటులో ఉంది. షావోమీ ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ 812mAh బ్యాటరీతో వస్తుంది. 21 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సర్కిల్ డయల్‌లో అమర్చిన 1.48-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. షావోమీ వాచ్ S5 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది.
షావోమీ వాచ్ S5 ధర, లభ్యత :
చైనాలో షావోమీ వాచ్ S5లో బ్లూటూత్ మాత్రమే ఉన్న క్లాసిక్ మోడల్ ధర CNY 1,199 (సుమారు రూ. 16,000) నుంచి ప్రారంభమవుతుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో ఫ్యాషన్ మోడల్ ధర CNY 1,399 (సుమారు రూ. 19,000)గా ఉంది. మరోవైపు, లెదర్ స్ట్రాప్‌తో eSIM మోడల్ ధర కూడా CNY 1,399 (సుమారు రూ. 19,000) గానే ఉంది.
ఈ స్మార్ట్‌వాచ్ షావోమీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. క్లాసిక్ మోడల్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్యాషన్ మోడల్ ఫోర్జ్డ్ కార్బన్, మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. eSIM మోడల్ బేజ్ కలర్ మాత్రమే అమ్మకానికి ఉంది.
షావోమీ వాచ్ S5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ షావోమీ వాచ్ S5, ఆండ్రాయిడ్ 8, ఆ తర్వాతి వెర్షన్లు, iOS 14, తర్వాతి వెర్షన్ల డివైజ్‌లకు సపోర్టు చేస్తుంది. షావోమీ ఈ కొత్త వేరబుల్‌లో 1.48-అంగుళాల (480×480 పిక్సెల్స్) అమోల్డ్ టచ్‌స్క్రీన్ అందిస్తుంది.
Read Also : OnePlus Nord Buds 4 Pro : ఛార్జ్ ఒక్కసారి.. మ్యూజిక్ 54 గంటలు.. ఈ OnePlus ఇయర్ బడ్స్ ధర చూస్తే షాక్ అవుతారు!
గరిష్టంగా 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 323 పీపీఐ పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్‌తో సహా 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. వర్కౌట్ డిటెక్షన్ కోసం ఆటో-స్టార్ట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
హెల్త్ మానిటరింగ్ ఫీచర్ల విషయానికి వస్తే..
షావోమీ వాచ్ S5లో క్యాలరీ కౌంటర్, పెడోమీటర్, హార్ట్ రేట్ మానిటర్, స్లిప్ మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ ట్రాక్ చేయడం, పడిపోవడాన్ని గుర్తించడం, మెన్సెస్ ట్రాక్ చేయడం వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ యూజర్ల నిద్రలో ఎలా శ్వాస తీసుకుంటున్నారో కూడా వారికి సమాచారాన్ని అందిస్తుంది.
ఆన్‌బోర్డ్ సెన్సార్లలో హార్ట్ రేటు సెన్సార్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, బారోమెట్రిక్ ప్రెజర్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి.
షావోమీ వాచ్ S5లో 815mAh బ్యాటరీ ఉంది. సాధారణ వాడకంతో 21 రోజుల వరకు వస్తుంది. రొటీన్ హెల్త్ మానిటరింగ్‌తో సుమారు 14 రోజుల బ్యాటరీ లైఫ్, AOD ఆన్ చేసి ఉంచితే సుమారు 9 రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ స్మార్ట్‌వాచ్ 5ATM వాటర్ రెసిస్టెన్స్ లెవల్‌తో వస్తుంది. రైట్ సైడ్ క్రౌన్, నావిగేషన్ బటన్ ఉన్నాయి. ఇందులో మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉన్నాయి. షావోమీ వాచ్ S5 కొలతలు (46x46x10.99mm), బరువు సుమారు 46గ్రాములు ఉంటుంది.
