Yamaha Prices Hike : బిగ్ షాక్.. ఇక స్కూటర్ కొనడం కష్టమేనా..? భారీగా పెరిగిన యమహా స్కూటర్ల ధరలు

Yamaha Price Hike : యమహా ఏరాక్స్ 155, ఎక్స్ఎస్ఆర్, ఫాసినో 125 ధరలు పెరిగాయి. భారత మార్కెట్లో ఇప్పటినుంచి ఈ కొత్త యమహ స్కూటర్లు కొత్త ధరలతో లభిస్తున్నాయి.

Yamaha Price Hike

  • యమహా మూడు స్కూటర్ల ధర భారీగా పెంపు
  • రేజెడ్ఆర్ 125, ఫాసినో 125, ఏరాక్స్ 155 కొత్త ధరలివే
  • దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లలో అందుబాటులో

Yamaha Price Hike : యమహా కస్టమర్లకు బిగ్ షాక్.. భారత మార్కెట్లో యుమహా స్కూటర్లలో రేజెడ్ఆర్ 125, ఫాసినో 125, ఏరాక్స్ 155ల ధరలు భారీగా పెరిగాయి. ఈ కొత్త ధరలతో కొన్ని మోడళ్లు రూ. 2,800 వరకు పెరిగాయి. ముడిసరుకు ఖర్చులు, రవాణా ఖర్చులే పెంపునకు కారణాలుగా కంపెనీ పేర్కొంది. మీరు కొత్త యమహా స్కూటర్‌ను కొనాలని చూస్తుంటే ప్రతి మోడల్ ధర ఎంత పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

యమహా మోటార్ ఇండియా అన్ని స్కూటర్ల రేంజ్ ధరలను (Yamaha Prices Hike) పెంచింది. రేజెడ్ఆర్ 125, ఫాసినో 125, ఏరాక్స్ 155 వంటి స్కూటర్లపై కంపెనీ రూ. 1,000 నుంచి రూ.2,800 వరకు ధరలను పెంచింది. ముడిసరుకుల ఖర్చులు, రవాణా వ్యయం, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేసింది. ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి.

ఈ పెంపు ఇటీవలే లాంచ్ అయిన అప్‌డేటెడ్ వేరియంట్‌లకు కూడా వర్తిస్తుంది. ఈ యమహా స్కూటర్లు భారత మార్కెట్‌లో రేజర్ జెడ్ఆర్ 125 స్టైల్, పర్ఫార్మెన్స్ చేయగా, ఫాసినో 125 ప్రీమియం లుక్స్ ఫీచర్లను అందిస్తుంది. ఏరాక్స్ 155 స్పోర్టీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గత ధరలతో పోలిస్తే ఈ స్కూటర్లు ఎంత ధర పెరిగాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Vivo X200 Pro : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. 200MP కెమెరాతో వివో ప్రో ఫోన్ చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

యమహా ఫాసినో 125 :
ఏప్రిల్ 2026లో యమహా ఫాసినో 125 కొత్త స్కూటర్ వచ్చింది. బ్యాక్ డిజైన్ అద్భుతమైన స్టైలింగ్‌ అందిస్తుంది. ముఖ్యంగా యువ రైడర్‌లను ఆకట్టుకుంటుంది. ఫీచర్లలో TFT డిస్‌ప్లేతో టాప్-స్పెక్ ఫాసినో ఎస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉన్నాయి.

రూ. 1,000 ధర పెంపు తర్వాత ఫాసినో ఎస్ ధర ఇప్పుడు రూ. 96,200 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కాగా, ఫాసినో డిస్క్ రూ. 89వేలకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్లు హైబ్రిడ్ టెక్నాలజీ, ఇంధన సామర్థ్యం, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

యమహా RayZR 125 :
యమహా రేజెడ్ఆర్ 125 రేంజ్ అన్ని వేరియంట్లపై రూ. 2,200 ధర పెరిగింది. ఏప్రిల్‌లో రూ. 660 ధర పెంపు తర్వాత ఇది రెండోసారి. కొత్త ధరలతో బేస్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 76,960, స్టాండర్డ్ డిస్క్ రూ. 83,760, డీలక్స్ రూ. 84,660కు లభిస్తుంది.

టాప్-స్పెక్ స్ట్రీట్ ర్యాలీ రూ. 89,760 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్ స్పోర్టీ లుక్, తక్కువ బరువు, గుడ్ హ్యాండ్లింగ్ వంటి కొత్త (సిల్వర్ వైట్ కాక్‌టెయిల్, మ్యాట్ గ్రే మెటాలిక్) కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు అప్పుడప్పుడు చేసే లాంగ్ డ్రైవ్ ప్రయాణాలకు కూడా బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు.

యమహా ఏరాక్స్ 155 :
యమహా ఏరాక్స్ 155 పెర్ఫార్మెన్స్-ఆధారిత స్కూటర్. ఆర్15 V4, 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 2,800 పెరిగింది. స్టాండర్డ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 1.43 లక్షలు ఉండగా, ఎస్ వెర్షన్ ధర రూ. 1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్కూటర్ ఫాస్ట్ యాక్సిలరేషన్, స్పోర్టీ డిజైన్, అద్భుతమైన బ్రేకింగ్, ప్రీమియం ఫీచర్లకు అందిస్తుంది. యువ రైడర్లలో ముఖ్యంగా స్కూటర్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్.