మద్యానికి డబ్బులు తక్కువయ్యాయని కూతుర్ని తాకట్టు పెట్టిన తండ్రి

  • Updated on- December 1, 2020 / 10:41 PM IST

father mortgage her daughter to bar owners for liquor  : తాగుడికి బానిసైన తండ్రి, తాగడానికి డబ్బులు కోసం కన్న కూతుర్ని తాకట్టు పెట్టిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. ఇంత వరకు మద్యం కోసం తల్లిపై దాడి చేసిన కొడుకుని భార్యపై దాడి చేసిన భర్త వార్తలను ఎన్నో చూశాం కానీ ఈ రోజు మత్తు కోసం మమకారాన్ని అంగడి సరుకుగా మార్చిన ఘటన జరిగింది

మహారాష్ట్ర్ర, నాందేడ్ కు చెందిన సతీష్ విజయవాడ వన్ టౌన్ , సామారంగ్ చౌక్ లో తాగడానికి ఓ బార్ కు వెళ్లాడు. అక్కడ తాగేందుకు డబ్బులు తక్కువ అవటంతో కన్న కూతుర్ని 5 వేల రూపాయలకు బార్ సిబ్బంది వద్ద తాకట్టు పెట్టాడు.



ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు బార్ వద్దకు వచ్చి సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. సతీష్ ని, కూతుర్ని పోలీసు స్టేషన్ కు తీసుకు వచ్చారు. అతని భార్యను స్టేషన్ కు పిలిపించారు. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సతీష్ కు కౌన్సిలింగ్ ఇచ్చి వొదిలేశారు. చిన్నారిని తల్లికి అప్పగించారు.