Sharat Saxena : అద్దంలో తన మొహం చూసుకుంటే అసహ్యం వేస్తుందంటున్న శరత్ సక్సేనా
విలన్ అనే పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోతారు. టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో వందల సినిమాల్లో నటించారు. అయితే 30 ఏళ్లుగా హీరోలతో తన్నులు తిని తిని విసుగు చెందిపోయాను అంటున్నారు ఓ విలన్. తన ముఖం చూస్తే తనకు అసహ్యం వేస్తోంది అంటున్న ఆ విలన్ ఎవరంటే..?
- Lakshmi 10tv
- Published On : May 28, 2023 / 05:43 PM IST
Actor Sharat Saxena
Actor Sharat Saxena : నటుడు శరత్ సక్సేనా అంటే తెలియని వారుండరు. విలన్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో 300 పైగా సినిమాలు చేసిన ఆయన రీసెంట్‌గా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
Virupaksha : విరూపాక్ష సినిమాలో మొదట విలన్ గా అనుకుంది ఆమెను కాదట.. కానీ సుకుమార్..
శరత్ సక్సేనా హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, పంజాబీ భాషల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా విలన్‌గా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది. తెలుగులో అయితే ఘరానా మొగుడు, ఎస్పీ పరశురాం, సింహాద్రి, బన్నీ సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఇటీవల కాలంలో ఆయన బాలీవుడ్‌ను వదిలిపెట్టి సౌత్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. అందుకు కారణం అక్కడ ఆయనను కేవలం ఫైట్ సీన్లకు మాత్రమే పరిమితం చేయడం చాలా బాధించిందట. రెడీ అవ్వడం సెట్స్‌కు వెళ్లడం అక్కడ హీరోలతో తన్నించుకోవడం ఇదే రొటీన్ కావడంతో విసుగు చెందారట. ఒక్కోసారి అద్దంలో తన ముఖం చూసుకోవాలంటేనే అసహ్యం వేసేంతలా అనిపించేదని రీసెంట్‌గా ఆయన చెప్పుకొచ్చారు.
Tollywood : బాలీవుడ్ హీరోలను విలన్స్ గా మారుస్తున్న టాలీవుడ్..
30 ఏళ్లుగా విలన్లతో తన్నించుకోవడమే పని కావడంతో అవే పాత్రలకు పరిమితం అయ్యానని శరత్ సక్సేనా అన్నారు. ఇదంతా తన మొహం బాగా లేకపోవడం వల్లే జరిగిందని చెప్పారు. కానీ తెలుగు వాళ్లు విలన్ పాత్రలు తలుచుకోగానే గుర్తుకు వచ్చేవారి వరుసలో మాత్రం శరత్ సక్సేనా స్థిరమైన స్ధానాన్ని సంపాదించుకున్నారు. విలన్‌గా తనదైన నటనను ప్రదర్శించి అందరీ మెప్పు పొందారు.
