Hyderabad Crime : బీటెక్ విద్యార్థినిపై దారుణం.. టీ తాగుదామని తీసుకెళ్లి.. మద్యం తాపించి ఆపై అత్యాచారం..
Hyderabad Crime : బీటెక్ విద్యార్థినికి మద్యం తాగించి ఆపై అత్యాచారినికి పాల్పడ్డాడు తోటి విద్యార్థి.
- Dharani Pilli
- Updated on- May 19, 2026 / 09:43 AM IST
hyderabad btech student molested by classmate in ibrahimpatnam accused arrested
- హైదరాబాద్ లో దారుణం
- మద్యం తాగించి తోటి విద్యార్థినిపై
- బీటెక్ స్టూడెంట్ అత్యాచారం
Hyderabad Crime : క్లాస్‌మేట్ అనే కదా అని నమ్మినందుకు ఆ యువతిని దారుణంగా మోసం చేశాడో యువకుడు. టీ తాగుదామని పిలిచి.. బయటకు తీసుకెళ్లాడు. ఆపై మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్.. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ నెల 14న ఉదయ్.. తన క్లాస్‌మేట్ అయిన యువతిని కారులో దిల్సుఖ్‌నగర్ టీ తాగడానికి తీసుకెళ్లాడు.
* బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు.. ఒకరి అరెస్ట్
ఆపై తిరుగు ప్రయాణంలో నిందితుడు ఉదయ్ మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం బీడీఎల్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లిన ఉదయ్.. విద్యార్థినికి మద్యం తాగించాడు. ఆ తర్వాత మత్తులో ఉన్న ఆమెను ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో ఈ నెల 17న బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఉడుతల ఉదయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
