Medchal HIV Injection : ప్రియురాలు తనకే దక్కాలన్న స్వార్థం.. యువతికి HIV ఇంజెక్షన్.. కానీ చివరకు

Medchal HIV Injection : ప్రియురాలు తనకే దక్కాలన్న స్వార్థంతో అప్పటికే హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ యువకుడు.. తన రక్తాన్ని బలవంతంగా ఆమెకి కూడా ఎక్కించాడు. చివరకు

in medchal After marriage rejection man injecdt hiv blood to girl after knowing this she ends her life in medchal

  • మేడ్చల్ హెచ్ఐవీ ఇంజెక్షన్ ఘటనలో విషాదం
  • మనస్థాపంతో యువతి ఆత్మహత్య
  • గత నెల యువతికి హెచ్ఐవీ ఇంజెక్షన్

Medchal HIV Injection : రాజు వెడ్స్ రాంబాయి సినిమా క్లైమాక్స్ తరహా సన్నివేశాలు అంటే ఎదుటి వ్యక్తికి తెలియకుండానో లేదంటే బలవంతంగానే HIV ఇంజెక్షన్ ఇచ్చే సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలో హీరోయిన్ కి ఆమె తండ్రి హెచ్ఐవీ రక్తం ఎక్కిస్తే.. తాజాగా ఓ చోట ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలనే స్వార్థంతో విచక్షణ మరిచి ఆమెకి హెచ్ఐవీ ఇంజెక్షన్ వేయించాడు నిందితుడు. అసలు విషయం తెలుసుకున్న బాధితురాలు.. అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ జిల్లా పరిధిలో వెలుగులోకి వచ్చింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాకు చెందిన నిందిత యువకుడు గత పాతికేళ్లుగా తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ శివారు మేడ్చల్ జిల్లా పోచారంలో నివాసం ఉంటున్నాడు. ఉపాధి నిమిత్తం.. ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆ యువకుడు చిన్నప్పటి నుంచి తన మరదలి మీద ఇష్టం పెంచుకున్నాడు. ఇరు వైపుల కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకారం తెలిపాయి. దీంతో కొన్ని రోజుల క్రితమే వీరిద్దరికి నిశ్చితార్థం నిర్వహించారు. అయితే పెళ్లికి ముందు యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అతడికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. యువకుడి తల్లిదండ్రులిద్దరూ హెచ్ఐవీ బాధితులే. తండ్రి ఆ మహమ్మారితో పోరాడుతూనే చనిపోయాడు. వీటన్నింటిని గమనించిన యువతి తండ్రి.. తన కుమార్తె భవిష్యత్తు కోసం ఆలోచించి.. నిందితుడికి కూడా పరీక్షలు చేయించగా.. అతడికి హెచ్ఐవీ అని తేలడంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారు.

Husband Gives HIV Injection To Wife : దారుణం.. బలానికి మందులు అంటూ, భార్యకు HIV ఇంజెక్షన్ వేయించిన భర్త..!

తన వల్ల ప్రియురాలి జీవితం నాశనం కావొద్దని ఆలోచించాల్సింది పోయి.. వివాహం రద్దు చేసుకున్నందుకు ఆమెపై పగ పెంచుకున్నాడు నిందితుడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అతడు.. వికృత నిర్ణయం తీసుకున్నాడు. ఆమెకి కూడా హెచ్ఐవీ సోకితే.. తాను తప్ప వేరే ఎవరు ఆమెని పెళ్లి చేసుకోరని భావించాడు. ఈ క్రమంలో 2026, మార్చి 11న పక్కా ప్లాన్ తో రంగలోకి దిగాడు. ఒక సిరంజీని కొనుగోలు చేసి.. అందులోకి తన రక్తాన్ని నింపుకున్నాడు. అదే రోజు సాయంత్రం వేళ యువతి ఇంటికి వెళ్లి.. ఆమెతో మరోసారి తన పెళ్లి విషయం ప్రస్తావించాడు. కానీ యువతి నిరాకరించడంతో.. తనతో తెచ్చుకున్న రక్తంతో కూడిన ఇంజెక్షన్‌ను బలవంతంగా ఆమెకు ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు.

Kurnool Incident: ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్..! ప్రియుడి భార్యకు HIV ఇంజక్షన్..! మాజీ ప్రియురాలి ఘాతుకం..!

ఈ దారుణం గురించి బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి.. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే.. తన రక్తంలోకి హెచ్ఐవీ రక్తం ప్రవేశించడంతో.. చనిపోతాననే భయం.. అందరూ తనను అసహ్యించుకుంటారని భావించిన యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.