అతని కోసం సెక్స్ మార్పిడి చేసుకుని భార్యగా మారాడు..భర్తేమే గొంతు కోశాడు

  • Publish Date - July 16, 2020 / 08:30 AM IST

ఢిల్లీ లో దారుణం జరిగింది. సెక్స్ మార్పిడి చేయిుంచుకున్న యువతిని ఆమె భర్త గొంతుకోసి పరారయ్యాడు. నాలుగేళ్ళ క్రితం ఒక యువకుడు సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని యువతిగా మారాడు. సెక్స్ మార్పిడి చేయించుకున్న ఏడాదికి ఆ యువతిని ఉత్తర ప్రదేశ్ మహోబా జిల్లాకు చెందిన శుక్లా అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమికులిద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత ఘాటు ప్రేమలో మునిగి పోయారు.

కొంతకాలానికి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి 2019, మార్చి 13 న పెళ్లిచేసుకున్నారు. ఈ పెళ్ళికి యువకుడి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పటంతో పెళ్లైన తర్వాత వారిద్దరూ కలిసి యువతి ఇంట్లోనే కాపురం పెట్టారు.
కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో రానురాను కలతలు మొదలయ్యాయి. తన భార్య పార్టీల పేరుతో బయటకి వెళ్లటానికి శుక్లా ఒప్పుకోలేదు. బయటకు వెళ్లవద్దని ఆమెను ఆంక్షల పేరుతో కట్టడి చేయసాగాడు.

క్రమేపి భార్యపై అనుమానం పెరగసాగింది. ఆమె సెల్ ఫోన్ ను చెక్ చేసేవాడు. ఆమెకు వచ్చిన మెసేజ్ లు చదివేవాడు. ఈవిషయమై ఇంట్లో తరచూ గొడవపడే వారు. ఈ గొడవ భరించలేని ఆమె తల్లితండ్రులు వీరిని వేరు కాపురం పెట్టమని సూచించారు. దీంతో వారిద్దరూ అక్కడి నుంచి లజపత్ నగర్ ఫేజ్ 4లో ఇల్లు అద్దెకు తీసుకుని వెళ్ళి పోయారు. అక్కడకు వెళ్ళినా వారి మధ్య గొడవలు తగ్గక పోగా మరింతపెరిగాయి. ఈ క్రమంలో భార్యా భర్తలు విడిపోయారు.

భర్త శుక్లా కోట్ల ముబారక్‌పూర్‌కు మారగా, భార్య దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలోని ఒక రెండడంతస్తుల భవనంలోకి మారింది. ఈ క్రమంలో శనివారం జులై11న భార్య వద్దకు వచ్చాడు శుక్లా. మళ్లీ భార్యా భర్తలు ఇద్దరూ తగువులాడుకున్నారు. ఆవేశంలో శుక్లా భార్యను గొంతుకోసి పరారయ్యాడు.

కొన ఊపిరితో ఉన్న భార్య శక్తి నంతటినీ కూడ గట్టుకుని గురుగాఁవ్ లో ఉన్నతన తండ్రికి వీడియో కాల్ చేసింది. మెడ నరాలు తెగటంవల్ల మాట చెప్పటానికి నోరు పెగలటం లేదు. వీడియో లో జరిగిన దారుణాన్ని చూపించింది. పరిస్ధితి అర్ధం చేసుకున్న తండ్రి పోలీసు కంట్రోల్ రూం కు సమాచారం ఇచ్చారు.

చుట్టు పక్కల వారి సహాయం కోసం సుత్తితో తలుపు కొట్ట సాగింది. ఇంతలో పక్కింటి వారు వచ్చిఆమె పరిస్ధితిని గమనించారు. వారు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి వాంగ్మూలం తీసుకుని నిందితుడు శుక్లాను అరెస్టు చేశారు.