Soundarya last wish : సౌందర్య కోరిన చివరి రెండు కోరికలు.. తీరకుండానే తరలిరాని లోకాలకు..
నటి సౌందర్యను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అద్భుతమైన నటనతో తనదైన ముద్ర వేసుకున్న సౌందర్య అతి చిన్న వయసులో విమాన ప్రమాదంలో మరణించారు. మరణానికి కొన్ని క్షణాల ముందు ఆమె తన వదినను రెండు కోరికలు కోరారట. తాజాగా ఆమె బయటపెట్టడంతో అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
- Lakshmi 10tv
- Published On : July 2, 2023 / 12:45 PM IST
Soundarya last wish
Soundarya last wish : వెండితెరపై అలరించిన ప్రముఖ నటీమణుల్లో సౌందర్యని ఎవరూ మర్చిపోరు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఆమె కెరియర్ చిన్నదే అయినా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అతి చిన్న వయసులో విమాన ప్రమాదంలో కన్నుమూశారు. అయితే ఇటీవల ఆమె తీరని కోరికలు రెండు వెలుగులోకి వచ్చాయి. మరణానికి కొన్ని సెకండ్ల ముందు తన వదినను రెండు కోరికలు కోరారట. అవి తీరకుండానే సౌందర్య తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు.
July Movie Releases : జులైలో రిలీజ్ కాబోతున్న సినిమాలివే.. ఒక లుక్ వేసేయండి..
నటి సౌందర్య ఏప్రిల్ 17, 2004 లో విమాన ప్రమాదంలో చిన్న వయసులో కన్నుమూశారు. ప్రమాద ఘటనకు ముందు ఆమె తన వదినతో పంచుకున్న విషయాల్ని ఇటీవల ఆమె వదిన రివీల్ చేయడంతో బయటకు వచ్చాయి. సాంప్రదాయ కుంకుమ, కాటన్ చీర కొనుగోలు చేయమని సౌందర్య తన వదినకు చెప్పారట. అవి ధరించి బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని తను అనుకుంటున్నట్లు చెప్పారట. ఓ స్త్రీ తన జీవితంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే ఈ రెండు వస్తువులను ఆమె కోరడం.. ఆ కోరిక తీరకపోవడం అభిమానుల మనసుల్ని కదిలించింది. సౌందర్య ఆకస్మిక మరణం ఆమె కుటుంబాన్ని, ఆమె అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అభిమానులైతే ఇప్పటికీ ఆమె మరణాన్ని జీర్ణించుకోలేరు. ఆమెలాంటి నటి మరలా స్క్రీన్‌పై కనపడే అవకాశం లేదని అభిమానులు నమ్ముతారు.
టాలీవుడ్‌లో తనదైన నటనతో ముద్ర వేసుకున్న సౌందర్య బాలీవుడ్‌లో సైతం అమితాబ్ బచ్చన్ సరసన ‘సూర్యవంశం’ సినిమాలో నటించారు. తన అద్వితీయమైన నటనతో జాతీయ అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. ఓవైపు నటిస్తూనే 2002 లో ‘ద్వీప’ అనే కన్నడ మూవీని నిర్మించారు సౌందర్య. ఎంతో భవిష్యత్ ఉన్న సౌందర్య అతి చిన్న వయసులో మరణించడం నిజంగా దురదృష్టం.
