లైంగిక వేధింపుల ఆరోపణల ఎదుర్కోంటున్న బీజేపీ ఎమ్మెల్యే పై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన లైంగిక దోపిడీ పై ఒక మహిళ చేసిన పోరాటం సఫలీకృతమయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే తనపై రెండేళ్లుగా అత్యాచారం చేశారని…ఫలితంగా బిడ్డకు జన్మనిచ్చానని డెహ్రాడూన్ కు చెందిన మహిళ ఆగస్ట్ 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు పుట్టిన బిడ్డకు తండ్రి నేగి అని ఆ మహిళ చేస్తున్న పోరాటం ఫలించింది.
ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి, అతని భార్యపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని డెహ్రాడూన్ అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులను ఆదేశించటంతో రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది.
మహేష్ నేగీ బాధిత మహిళను రేండేళ్ళుగా లైంగికంగా వేధించగా, ఆ నేరాన్ని కప్పిపుచ్చటానికి అతని భార్య డబ్బు ఇచ్చిందని బాధితురాలి తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈమేరకు బాధితురాలి పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు వారిద్దరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
కాంగ్రెస్ నేతల కుట్రల వల్లే తనపై అత్యాచార ఆరోపణలు వచ్చాయని మహేషి నేగి అన్నారు. కాగా బాధిత మహిళ ఆరోపణలపై, ఎమ్మెల్యే భార్య పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఓ మహిళ తనను రూ.5కోట్లు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఫిర్యాదు చేశారు.
రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ జరిపి వివరాలు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు మహేష్ నేగి, అతని భార్యపై కేసు నమోదు చేసి విచారణ జరపమని చెప్పటంతో ఉత్తరాఖండ్ రాజకీయాలు వేడెక్కాయి.
బాధిత మహిళ ఆరోపణ
ఎమ్మెల్యేకు తనతో గత రెండేళ్ళుగా శారీరక సంబంధం ఉందని, తన కుమార్తె డీఎన్‌ఏ తన భర్త డీఎన్ఏతో సరిపోలడం లేదని, ఎమ్మెల్యే డీఎన్‌ను ఒకసారి పరీక్షించాలని, అది మ్యాచ్ అవుతుందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొన్నది.
2016 నుంచి 2018 మధ్య ఎమ్మెల్యే తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, పెళ్లి తరువాత కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని బాధిత మహిళ ఆగస్ట్ 18 న పోలీసలుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు. లైంగిక వేధిపుల ఆరోపణలకు సంబంధించి ఆ మహిళ ఒక వీడియోను కూడా విడుదల చేసింది.
ఎమ్మెల్యే కారణంగా తనతో భర్త తెగదెంపులు చేసుకున్నాడని ఫిర్యాదులో వివరించారు. ఎమ్మెల్యేతో సాన్నిహిత్యంగా ఉండటం వల్ల తాను ఈ ఏడాది మే 18న ఒక బిడ్డకు జన్మనిచ్చానని మహిళ తెలిపారు. నిజానిజాలను తెలుసుకునేందుకు తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఆమె ఫిర్యాదులో తెలిపారు.
అంతేకాదు ఈ వ్యవహారంపై నోరువిప్పకుండా ఉండేందుకు ఎమ్మెల్యే భార్య గతంలో తనకు 25లక్షలు రూపాయలు ఇవ్వచూపారని కూడా ఆమె ఆరోపించారు. భర్త తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే భార్య బాధిత మహిళపై కూడా ఫిర్యాదు చేశారు.
ఓ మహిళ తనను 5 కోట్లు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఆరోపణ చేస్తూ ఫిర్యాదు చేశారు. కాగా…..ఎమ్మెల్యే భార్య కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని… తాను ఎలాంటి డబ్బు డిమాండ్ చేయలేదని బాధిత మహిళ తెలిపింది. కాగా, మహేష్ నేగీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళను అరెస్టు చేయడంపై నైనిటాల్ హైకోర్టు గతంలో స్టే విధించింది.