Warangal Swimming Pool Case : వరంగల్ భార్య ఇద్దరు కుమార్తెల హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 9 మంది అరెస్ట్.. పరారీలో ఇద్దరు లేడీ డాక్టర్లు.. !
Warangal Swimming Pool Case : వరంగల్లో సంచలనం సృష్యింయింది, తాజాాా ఈసులో ఆమెని విభనంగాం చూపంచారు.
- Dharani Pilli
- Published On : April 10, 2026 / 04:12 PM IST
warangal swimming pool case police arrest nine members two lady doctors under go escape
- వరంగల్ స్విమ్మింగ్ ఫూల్ హత్య కేసులో బిగ్ అప్డేట్
- అజారుద్దీన్ తో పాటు 9 మంది అరెస్ట్
- పరారీలో ఇద్దరు మహిళా డాక్టర్లు
Warangal Swimming Pool Case : వరంగల్‌లో గర్భవతి అయిన భార్యతో పాటు, ఇద్దరు కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లో తోసి హత్య చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో ఇద్దరు మహిళా డాక్టర్లు ఉండటం సంచలనంగా మారింది. గర్భవతి అయిన భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లోకి తోసి హత్య చేశాడు నిందితుడు అజారుద్దీన్. పక్కా ప్లాన్ ప్రకారం.. స్విమ్మింగ్ పూల్ వద్ద సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి.. భార్యాబిడ్డలను దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ప్రధాన నిందితుడు అజారుద్దీన్ తో పాటు 9 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ రవళిలు అజారుద్దీన్ భార్యకు గతంలో పలుమార్లు అబార్షన్లు చేసినట్లు గుర్తించారు. స్కానింగ్‌లో ఆడపిల్లలు అని తేలడంతో 2021లో ఒకసారి, 2026లో మరోసారి అజారుద్దీన్ తన భార్యకు అబార్షన్లు చేయించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో అజారుద్దీన్ భార్య మరోసారి గర్భం దాల్చింది. ఈసారి కూడా ఆడపిల్లే అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. కానీ అజారుద్దీన్ భార్య అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమెను హత్య చేయాలని భావించిన నిందితుడు.. ఆమెతో పాటు కుమార్తెలను కూడా కాటికి పంపాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నట్లుగానే ఈ నెల 2న అతడు పనిచేసే స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వారిని తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యాబిడ్డలను స్విమ్మింగ్ పూల్‌లోకి తోసి హత్య చేశాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత దీని గురించి ఇరు కుటుంబాలకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కీలక విషయాలను వెలికి తీశారు. పక్కా ప్లాన్ ప్రకారమే అజారుద్దీన్ తన భార్యను హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు.. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారు, అతడికి సహకరించిన వారు, కుటుంబ సభ్యులతో సహా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అజారుద్దీన్ భార్యకు గతంలో అబార్షన్ చేసిన ఇద్దరు వైద్యులు డాక్టర్ రవళి, డాక్టర్ బాల్నే పూర్ణిమ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
