బాలికను గ్యాంగ్ రేప్ చేసి, చెట్టుకి ఉరితీసిన, పదో తరగతి విద్యార్థులు దొరికారు

అసోం రాష్ట్రంలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు ఘాతుకానికి ఒడిగట్టారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో.. ఎవరూ ఊహించని ఘోరం చేశారు. పన్నేండేళ్ల

  • Publish Date - March 2, 2020 / 03:00 AM IST

అసోం రాష్ట్రంలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు ఘాతుకానికి ఒడిగట్టారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో.. ఎవరూ ఊహించని ఘోరం చేశారు. పన్నేండేళ్ల

అసోం రాష్ట్రంలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు ఘాతుకానికి ఒడిగట్టారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో.. ఎవరూ ఊహించని ఘోరం చేశారు. పన్నేండేళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. గ్యాంప్ రేప్ తర్వాత బాలికను చెట్టుకి ఉరి తీశారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) బిశ్వనాథ్ జిల్లాలోని(biswanath) చక్లా(chakla) గ్రామంలో ఈ దారుణం జరిగింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆ ఏడుగురిని ఆదివారం(మార్చి 1,2020) అదుపులోకి తీసుకున్నారు. గోహ్ పూర్(gohpur) లోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఏడుగురిని పట్టుకున్నారు.

నమ్మించి..పిలిపించి..గ్యాంగ్ రేప్..మర్డర్:
10వ తరగతికి చెందిన ఏడుగురు విద్యార్థులు.. పన్నెండేళ్ల బాలికను నమ్మించి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లో పార్టీ ఉందని చెప్పి బాలికను రప్పించారు. ఆ ఇంటికి సమీపంలోనే అడవి ఉంది. అడవిలోకి బాలికను తీసుకెళ్లి ఏడుగురు అత్యాచారానికి తెగబడ్డారు. కామవాంఛ తీర్చుకున్న తర్వాత బాలికను దారుణంగా చంపేశారు. బాలిక ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు చెట్టుకు వేలాడదీశారు. ఆధారాలు దొరక్కూడదన్న ఉద్దేశంతో పక్కా ప్రొఫెషనల్‌గా హత్యాచారానికి పాల్పడింది పదో తరగతి విద్యార్థులు కావడం అందరిని షాక్ కి గురి చేసింది.

ఎవరికీ అనుమానం రాకుండా ఉరి:
బాలికపై కన్నేసిన విద్యార్థులు మాయమాటలతో మోసం చేశారు. పార్టీ పేరుతో ఇంటికి పిలిపించి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పశువాంఛ తీర్చుకున్న ఏడుగురు టీనేజర్లు.. రేప్ చేసిన విషయం ఎవరికైనా చెబుతుందేమోనన్న అనుమానంతో బాలికను దారుణంగా చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా బాలిక ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా ఆమె మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు.

షాక్ లో బాలిక కుటుంబసభ్యులు:
ఇంటి నుంచి బయటికెళ్లిన బాలిక రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికే చెందిన ఇద్దరు టీనేజర్లపై అనుమానం వచ్చి వారి కోసం వెతకగా అటవీ ప్రాంతంలో కనిపించారు. బాలిక కుటుంబ సభ్యులు రావడం గమనించి టీనేజర్లు అక్కడి నుంచి పరారయ్యారు. అటవీ ప్రాంతంలోనే ఏదో జరిగి ఉంటుందన్న అనుమానంతో క్షుణ్ణంగా గాలించగా శనివారం(ఫిబ్రరి 29,2020) బాలిక మృతదేహం కనిపించింది. ఓ చెట్టుకు బాలిక మృతదేహం వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

టీనేజర్లను ఉరి తీయాలని డిమాండ్:
ఆ ఏడుగురు టీనేజర్లే తన కూతురుని రేప్ చేసి చంపేశారని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, ఆ ఏడుగురు విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయడం గమనార్హం. గ్యాంగ్ రేప్, మర్డర్ తర్వాత ఏడుగురు విద్యార్థులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలించిన పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. బాలికపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరి తీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే:
ఇంకా 10వ తరగతి చదువుతున్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసు. స్కూల్ కి వెళ్లడం, ఆడుకోవడం తప్ప మరో ఆలోచన ఉండకూడదు. అలాంటి వయసులో.. ఏడుగురు టీనేజర్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. గ్యాంగ్ రేప్ చేయడమే కాదు విషయం బటయపడకుండా బాలికను చంపేసి, మృతదేహాన్ని చెట్టుకి ఉరి తియ్యడం వారి క్రిమినల్ మైండ్ కు అద్దం పడుతుంది. పిల్లల్లో బయటపడిన ఈ నేర ప్రవర్తన.. తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తోంది. పిల్లలు చెడు దారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ దే. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? ఇలాంటి విషయాలపై కన్నేసి ఉంచాలి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు.