ప్రసవిస్తుండగా 15ఏళ్ల అత్యాచార బాధితురాలు మృతి

కామం కాటేసిన బాలికను కాలం వెలివేసింది. 15ఏళ్లకే అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాలిక ప్రసవించే సంయంలో మరణించింది. ప్రాణాలతో పోరాడి అలసిపోయింది. చివరకు కాలమే గెలిచింది. ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో జిల్లాలో మంగళవారం (డిసెంబర్ 18) ఈ ఘటన జరిగింది. 

పోలీసుల కథనం ప్రకారం..మార్చి నెలలో పక్కింట్లో ఉండే 17 ఏళ్ల బాలుడు బాలికలపై అత్యాచారం చేశాడు. తరువాత ఆమె గర్భందాల్చింది. ఇది తెలియటంతో గ్రామ స్థాయిలో పంచాయితీ పెట్టారు. బాలికను నిందితుడే వివాహమాడాలని తీర్పుచెప్పారు. దీంతో సదరు నిందితుడు పారిపోయాడు. దీంతో అతనిపై అక్టోబరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 376కింద కేసు నమోదు చేశారు. 

తరువాత పరారైన నిందుతుడ్ని గాలించి అదుపులోకి తీసుకుని నవంబర్ లో జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. బాల్యంలోనే బాధితురాలు గర్భం దాల్చటంతో తీవ్ర రక్తహీనతతో ఉన్నదని డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలో బాలికకు నొప్పులు వచ్చాయి.  ప్రసవ నొప్పులతో తీవ్రమైన బాధను అనుభవించి చనిపోయింది.  దీంతో ఆమెను శిశు సంరక్షణ కమిటీకి తరలించారు.
బాలిక గర్భం దాల్చటానికి కారణమైనవాడు  జువైనల్ హోమ్ లో ఉండటం.తో బాలిక మృతదేహాన్ని ఏ కుటుంబానికి ఇవ్వడం లేదనీ తెలిపారు. బాధితురాలు, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి విభిన్న మతాలకు చెందిన వారని బాలిక మృతదేహంతో గ్రామంలో అల్లర్లు చోటు చేసుకునే ప్రమాదం ఉందని స్టేషన్ అధికారి తెలిపారు. గ్రామంలో లా అండ్ ఆర్డర్ లేదని పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈక్రమంలో బాలిక మృతదేహానికి అంత్యక్రియలు చేసే విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని సదరు కమిటీ తెలిపింది.