Gang Rape In Train : రైలులో ప్రయాణికురాలిపై దోపిడీ దొంగల సామూహిక అత్యాచారం

రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రయాణికురాలిపై 8 మంది దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Gang Rape In Train :  రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రయాణికురాలిపై 8 మంది దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి  ఉత్తరప్రదేశ్ లోని లక్నో నుంచి మహారాష్ట్ర  ముంబై వెళుతున్న పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైలులోకి 8 మంది దొంగలు మారణాయుధాలతో ప్రవేశించారు.

వీరు మహారాష్ట్రలోని ఇజత్ పూర్ వద్ద స్లీపర్ కోచ్ లోకి ఎక్కి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ళ ప్రయాణికురాలిని  కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో  కొందరు దుండగులు  ప్రయాణికుల వద్ద నగదు, బంగారం దోచుకుంటుండగా మరికొందరు ఆమెపై అత్యాచారం చేశారు.

Also Read : Red Sandal Smuggler : పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్

బంగారం,డబ్బు ఇవ్వని ఐదారుగురు ప్రయాణికులను దొంగలు తీవ్రంగా గాయపరిచారు. దీంతో ప్రయాణికులందరూ ఒక్కసారి గట్టిగా అరవటంతో రైలును ముంబైలోని కాసరా స్టేషన్ లో ఆపివేశారు. అప్రమత్తమైన పోలీసులు దోపిడీ జరిగిన కోచ్ వద్దకు చేరుకుని ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. పారిపోతున్న మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.

మరో నలుగురు పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న దొంగల వద్దనుంచి రూ. 34 వేల నగద, ఇతర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు