5-year-old girl dies: ఐదేళ్ల బాలికపై పడ్డ గేటు.. పాప మృతి.. ఇద్దరి అరెస్టు
తమిళనాడులోని కిల్పాక్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇనుప గేటు తనపై పడడంతో ఓ ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. హార్లేస్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది గేటును మూస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పడిపోయింది. అదే సమయంలో హరిణి శ్రీ అనే బాలిక అక్కడే ఉండడంతో ఆమె గేటు కింద ఇరుక్కుపోయింది.
- T Venkateshwarlu
- Updated on- January 30, 2023 / 09:00 AM IST
Alabama shooting
5-year-old girl dies: తమిళనాడులోని కిల్పాక్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇనుప గేటు తనపై పడడంతో ఓ ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. హార్లేస్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది గేటును మూస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పడిపోయింది. అదే సమయంలో హరిణి శ్రీ అనే బాలిక అక్కడే ఉండడంతో ఆమె గేటు కింద ఇరుక్కుపోయింది.
ఆమెను బయటకు తీసిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కమర్షియల్ కాంప్లెక్స్ మేనేజర్ ను, ఓ సెక్యూరిటీ గార్డ్ ను అరెస్టు చేశారు. హరిణి శ్రీ తండ్రి శంకర్ ఆ కాంప్లెక్స్ వద్ద వాలెట్ పార్కింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. హరిణి శ్రీ తన తల్లితో కలిసి తండ్రి కోసం కాంప్లెక్స్ వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు.
గేటు వద్ద హరిణి ఆడుకుంటున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ సంపత్ గేటును మూసే ప్రయత్నం చేశాడని, అయితే అది ఒక్కసారిగా జారి పడిందని చెప్పారు. గేటును సరిగ్గా బిగించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. హరిణి శ్రీ ఓ ప్రైవేటు స్కూలులో ఒకటో తరగతి చదువుతుందని చెప్పారు. నమ్మల్వార్పేట్ లో హరిణి శ్రీ ఇల్లు ఉంటుందని తెలిపారు.
