Budget Session: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న ప్రభుత్వం

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. వచ్చే ఏడాది వోటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.

Budget Session: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న ప్రభుత్వం

Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు సమావేశానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో ఈ సమావేశం జరుగుతుంది.

IND vs NZ T20 Match: ఉత్కంఠ‌భ‌రిత పోరులో కివీస్‌పై టీమిండియా విజ‌యం.. ఫొటోలు

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. వచ్చే ఏడాది వోటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. బడ్జెట్ ఉన్నందువల్ల ఈసారి మొదటి రెండు రోజులు జీరో అవర్, కొశ్చన్ అవర్‌ను కేంద్రం నిర్వహించడం లేదు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. తర్వాత రాజ్యసభలో బడ్జెట్‌పై ప్రసంగిస్తారు. కీలక ప్రజా సమస్యలపై సాగే జీరో అవర్‌ను ఫిబ్రవరి 2 నుంచి కొనసాగిస్తారు.

Harish Shankar : పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు.. హరీష్ శంకర్ సంచలన కామెంట్స్..

అదేరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. తర్వాత కొద్ది రోజుల విరామం తర్వాత బడ్జెట్ రెండో సెషన్ మార్చి 13న ప్రారంభమై, ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం దేశాన్ని పీడిస్తున్న సమయంలో వస్తున్న బడ్జెట్ కావడంతో దీనిపై ఎన్నో అంచనాలున్నాయి. అనేక శాఖలకు గ్రాంట్స్‌కు సంబంధించి డిమాండ్ ఉండటంతో ఏ శాఖలకు ఎంత కేటాయిస్తారనే అంశంపై కూడా సందేహాలున్నాయి. మరోవైపు పన్ను రేట్లు, స్లాబ్స్‌లో మార్పు వంటివి కూడా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.