ఈఎస్ఐ ఐఎమ్ ఎస్ కేసులో బయటపడుతున్న అక్రమాలు

  • Publish Date - October 3, 2019 / 11:45 AM IST

ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటికొస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో కళ్ల బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో ఈఎస్ఐ ఐఎమ్ ఎస్ కేసు అక్రమాలు బయటపడుతున్నాయి. గత నాలుగేళ్లలో రూ.1000 కోట్ల మందుల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించారు.

ప్రధానంగా ఐఎస్ ఐ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దేవికారాణి 2014 నుంచి 2018 వరకు దాదాపు రూ.1000 కోట్ల వరకు ఈఎస్ ఐలో మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు అధారాలు సేకరించారు. ఏడాదికి సుమారు రూ.250 కోట్ల మందుల కొనుగోళ్లు జరిగినట్లు ఏసీబీ అధారాలు సేకరించింది. మందుల కొనుగోళ్లకు సంబంధించి ఏసీబీ ఆధారాలు, డాక్యుమెంట్లు సేకరించింది. 

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల దగ్గర ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలు మెడికల్ ఏజెన్సీల ఆఫీసుల్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది. నిన్న ఓమ్ని మైడ్ ఉద్యోగి నాగరాజు ఇంట్లో దొరికిన 46 కోట్ల నకిలీ ఇండెంట్ల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

నకిలీ ఇండెంట్లకు సంబంధించి మరికొందరు ఈఎస్ ఐ ఉద్యోగుల సంతకాలను గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లతోపాటు అధికారుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. త్వరలోనే మరికొందరి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ కానీ లేదా రేపు కానీ మరికొందరినీ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.