Amritpal Singhs wife : కిరణ్‌దీప్‌కు లుక్ అవుట్ నోటీసు…విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు

ఖలిస్థాన్ నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్‌కు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేసినందున కిరణ్‌దీప్‌ ను ఇంగ్లాండ్ విమానం ఎక్కకుండా విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు....

Amritpal Singhs wife Kirandeep : ఖలిస్థాన్ నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్‌కు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. బ్రిటీష్ జాతీయురాలైన అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్‌ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు బర్మింగ్‌హామ్‌కు వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కేందుకు వచ్చారు. (Amritpal Singhs wife Kirandeep) లుక్ అవుట్ నోటీసు జారీ చేసినందున కిరణ్‌దీప్‌ ను ఇంగ్లాండ్ విమానం ఎక్కకుండా విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. (stopped from boarding flight)

Tiger : యూపీ అడవిలో యువకుడిని చంపిన పులి

అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన రెండున్నర నెలల తర్వాత అతని భార్య కిరణ్‌దీప్ ఇంగ్లాండ్ (Delhi airport to UK) దేశానికి పారిపోయేందుకు యత్నించి విఫలమయ్యారు. కిరణ్‌దీప్ ఇటీవల ఇంగ్లాండుకు పారిపోయేందుకు మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను మొదటిసారిగా ఏప్రిల్ 20వతేదీన అమృత్‌సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం కిరణ్ దీప్ తన భర్త అమృతపాల్ సింగ్ ఉన్న దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో కనిపించారు.

New Zealand : న్యూజిలాండ్‌లో కాల్పులు, ఇద్దరి మృతి..షూటర్ హతం

కిరణ్‌దీప్‌ కౌర్‌ జైలుకు వెళ్లి అమృతపాల్‌కు సమాచారం అందజేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అమృతపాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను విమానాశ్రయంలో ఆపడం సరికాదని అకాల్ తఖ్త్ చీఫ్ అన్నారు. కిరణ్‌దీప్ కౌర్ బ్రిటీష్ పౌరురాలు. అయితే ఆమె ఇప్పటివరకు చండీగఢ్‌లోని బ్రిటిష్ కాన్సులేట్‌ను సంప్రదించలేదని తెలుస్తోంది.

Telangana : పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నగరంలో ఇళ్ల పంపిణీకి షెడ్యూల్ ఖరారు, ఏకంగా 70వేల ఇళ్లు..

కిరణ్‌దీప్ కౌర్ ఫిబ్రవరి 10వతేదీన పంజాబ్‌లోని జల్లుపూర్ ఖేరా గ్రామంలో అమృతపాల్ సింగ్‌ను వివాహం చేసుకుంది. కౌర్ ఏప్రిల్ 20వతేదీన యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లే విమానం ఎక్కకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కాల్సి ఉండగా గతంలోనూ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు