Hawaldar Arrested : ముగ్గురు పెళ్లాల మొగుడు….హవల్దార్ మనీష్ అరెస్ట్

భారత ఆర్మీలో హవల్దార్‌గా పని చేసే వ్యక్తి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు ట్రాన్సఫర్ అవుతున్నాడు. అలా వెళ్లిన రెండు ఊళ్లలో ఇద్దరూ  అమ్మాయిలని  పెళ్లి చేసుకున్నాడు.

Hawaldar Arrested : భారత ఆర్మీలో హవల్దార్‌గా పని చేసే వ్యక్తి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు ట్రాన్సఫర్ అవుతున్నాడు. అలా వెళ్లిన రెండు ఊళ్లలో ఇద్దరూ  అమ్మాయిలని  పెళ్లి చేసుకున్నాడు. మొత్తం మూడు పెళ్లిళ్ళు చేసుకున్న అతని గుట్టు రెండో పెళ్లాం ఫిర్యాదుతో రట్టు అయ్యింది.

హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన మనీష్ కుమార్ భారత్ ఆర్మీలో హవల్దార్‌గా పని చేస్తున్నాడు. మోనిక అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అతనికి హైదరాబాద్ ట్రాన్సఫర్ అయ్యింది. భార్యా, పిల్లలను  కురుక్షేత్రలో తల్లితండ్రుల వద్ద ఉంచి హైదరాబాద్ లో    ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. హైదరాబాద్ లో షీలా సింగ్ అనే మహిళ మనీష్ కు పరిచయం అయ్యింది.

తనకు వివాహం అయిన విషయాన్నిదాచి పెట్టి మనీషాను 2014  సెప్టెంబర్ లో వివాహాం చేసుకున్నాడు. ఈక్రమంలో 2016 లో ఆమె నెల తప్పింది. మనీష్   ఆమెకు అబార్షన్ చేయించాడు.   2018 లో మనీష్ కు   వేరే చోటకు ట్రాన్సఫర్ అయ్యింది. డ్యూటీలో చేరే నెపంతో   షీలాను హైదరాబాద్ లో ఉంచి మనీష్ వెళ్ళిపోయాడు.

Read Also : Sucharita : దిశ చట్టాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ కార్యక్రమాలు : మంత్రి సుచరిత

భర్త కోసం వెతికిన షీలా   2019లో అతని ఆచూకి కనిపెట్టింది. అప్పుడు ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కంటోన్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. భార్యను  చూసి కంగు తిన్నమనీష్ ఆమెను కంకర్ ఖేరా మెయిన్ బజారులో ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు.

అక్కడ ఉండగా ఆమె మరో సారి గర్భం దాల్చింది. ఈసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈలోగా భర్త గురించి  షాకింగ్ విషయం తెలుసు కుంది షీలా. చాందినీ అన్సారీ అనే మరో మహిళను వివాహం చేసుకుని మీరట్ లోని శ్రధ్దాపురిలో కాపురం పెట్టినట్లు తెలుసుకుంది.

గత నెల 26న   భర్త డ్యూటీ పేరుతో బయటకు వెళ్లిన కొద్ది సేపటికి   షీలా,  చాందిని ఇంటికి వెళ్లింది. అక్కడ ఉన్న భర్త  మనీష్ ను చాందినీతో సహా  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముగ్గురు కలిసి కంకర్ ఖేరా పోలీసు స్టేషన్ కు వెళ్లారు.

అక్కడ షీలా మనీష్ పై….తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా మనీష్ 3 వివాహాలు చేసుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు, దీంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు