Sucharita : దిశ చట్టాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ కార్యక్రమాలు : మంత్రి సుచరిత

టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Sucharita : దిశ చట్టాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ కార్యక్రమాలు : మంత్రి సుచరిత

Sucharita

Sucharita angry over TDP : టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం గురించి టీడీపీ నేతలు పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని సూంచించారు. లేదంటే రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుల ద్వారా కేంద్రం ఆమోదానికి కృషి చేయాలని హితవు పలికారు.

మహిళల రక్షణ కోసం టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిపై అనుమానం కలుగుతుందన్నారు. ఏదైనా సంఘటన జరిగితే దాన్ని రాజకీయం చేసి, రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఎంతవరకు సమంజసమని అన్నారు. దిశ యాప్ ను 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారుని పేర్కొన్నారు. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికి నమ్మకం పోయేలా చేయడానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు.

దిశ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీలు మద్దతు తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని కొర్రీలు పెట్టింది…వాటిని సవరించి మళ్లీ పంపించామని తెలిపారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి హోంశాఖ వద్దకు ఇప్పుడది చేరిందన్నారు. అక్కడ ఆమోదం పొందాక రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాక చట్టం అమలులోకి వస్తుందని తెలిపారు.

దిశ చట్టం అమల్లోకి వచ్చే క్రమంలో 18 ఉమెన్ పోలీస్ స్టేషన్లను, 3 ఫోరెన్సిక్ ల్యాబరేటరీలు, పెట్రోలింగ్ వాహనాలు, వన్ స్టాప్ సెంటర్ లను, ప్రత్యేక పి.పి.ని ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. చార్జీషీట్ వేయడానికి 200 రోజులు అయ్యేదని, ప్రస్తుతం 45 రోజులు అవుతుందన్నారు.

ఏడు రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేసిన కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు గత ప్రభుత్వంలో కూడా జరిగాయని తెలిపారు. జిల్లాకు సగటున 1000 కేసులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టులు వస్తే త్వరితగతిన పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.