attack on fastfood center in chikkadpally: హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వీరంగం సృష్టించారు. నిర్వాహకులపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. అజామాబాద్‌లోని స్పైస్ కోర్టు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై ఆరుగురు ఆగంతకులు దాడికి పాల్పడ్డారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి నిర్వాహకులపై దాడి చేశారు. సీసీ కెమెరాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసి పరారయ్యారు. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీలే దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.