శాండల్ ఉడ్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం
- murthy
- Published On : March 13, 2021 / 01:26 PM IST
Hero Tanish On Drugs Case
bengaluru police served notice to hero tanish for drugs case : శాండల్ ఉడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. కర్ణాటకలో ఇటీవల సంచలనంసృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలని హీరో తనీష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
శనివారం మార్చి13న జరిగే విచారణకు హజరవ్వాలను తనీష్ తో పాటు మరో అయిదుగురికి పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరిలో ప్రముఖ నిర్మాతశంకర్ గౌడతో పాటు ఓ వ్యాపార వేత్తకూడా ఉన్నారు. శంకర్ గౌడ ఏర్పాటు చేసిన పాల్గోన్న పలువురు ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి మొదట ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి మరింత సమాచారం రాబట్టారు. దీంతో పలువురు శాండల్ ఉడ్ నటులకు…. ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు తెలియటంతో వారిని ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
కాగా 2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో అప్పట్లో తనీష్ తో పాటు పలువురు సీనీ ప్రముఖులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2017లో శంకర్ గౌడ ఇచ్చిన పార్టీకి వెళ్లినందుకు పోలీసులు 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద్ నోటీసులు ఇచ్చినట్లు తనీష్ వివరించాడు. ఆ రోజు శంకర్ గౌడ్ పార్టీకి తాను వెళ్లాను కానీ డ్రగ్స్ తీసుకోలేదని అతను వివరణ ఇచ్చాడు.
