అర్ధరాత్రి బీభత్సం : రెచ్చిపోయిన బైక్ రేసర్లు

హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్ లో అర్ధరాత్రి యువకులు బైక్ రేసులు నిర్వహించారు.

  • Publish Date - March 24, 2019 / 03:40 AM IST

హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్ లో అర్ధరాత్రి యువకులు బైక్ రేసులు నిర్వహించారు.

హైదరాబాద్ : నగరంలో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్ లో అర్ధరాత్రి యువకులు బైక్ రేసులు నిర్వహించారు. స్టంట్స్ నిర్వహిస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. రేసర్ల స్పీడ్ కు పోలీసులు అడ్డుకట్టవేశారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు రేసుల్లో పాల్గొన్న పలువురు యువకులను అరెస్టు చేశారు. పోలీసులు మూడు టీమ్ లుగా విడిపోయి వారిని అదుపులోకి తీసుకున్నారు. 30 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.